Share News

ఫలించిన నిరీక్షణ..

ABN , Publish Date - Jul 23 , 2025 | 01:13 AM

ఎంతో కాలంగా రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించింది. ఏడాది కాలం ఆల స్యమైనా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డు లను మంజూరు చేసింది. రేషన్‌ కార్డుల మంజూరు ప్రకియ నిరంతరంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

ఫలించిన నిరీక్షణ..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఎంతో కాలంగా రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించింది. ఏడాది కాలం ఆల స్యమైనా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డు లను మంజూరు చేసింది. రేషన్‌ కార్డుల మంజూరు ప్రకియ నిరంతరంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం రేషన్‌ కార్డులపై కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బోగస్‌ రేషన్‌ కార్డులను ఏరివేసేందుకు 2015లో కొత్తగా దరఖాస్తులు తీసుకుని ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. అంతేగాకుండా రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా చేసింది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. కానీ రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను నిలిపి వేసింది. అనేక మంది రేషన్‌ కార్డుల కోసం ఇబ్బందులు పడ్డారు. 2019 నుంచి 2023 నవంబర్‌ వరకు అప్పటి ప్రభుత్వం ఒకసారి మాత్రమే 2021 అక్టోబర్‌లో కొందరికి రేషన్‌కార్డులను మంజూరు చేసింది. ఆ తర్వాత కార్డులు మంజూరు చేయలేదు. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే రేషన్‌ కార్డులను జారీ చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు ప్రజాపాలనలో, ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించి ఎట్టకేలకూ కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేసింది. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి రేషన్‌ కార్డులను పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. అయితే జిల్లాలో గత వారం నుంచి ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తున్నారు.

ఫ సంక్షేమ పథకాలు పొందే అవకాశం..

రేషన్‌ కార్డులు లేక సంక్షేమ పథకాలకు దూరమైన వారికి కొత్త కార్డుల జారీతో సంక్షేమ పథకాలు దక్కను న్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా కొన్ని పథకాలను అమలు చేస్తున్నది. అం దులో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్లు, పిల్లలు ఉన్నత చదువులు చదుకునేం దుకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొం దేందుకు రేషన్‌ కార్డు తప్పనిసరి. అలాగే రేషన్‌కార్డులు లేక ఆరోగ్యశ్రీ కార్డులు పొందలేకపోయారు. ఈ కార్డులపై గతంలో 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సౌకర్యం పొందే అవకాశం ఉండగా, దానిని ప్రస్తుత ప్రభుత్వం 10 లక్షల రూపాయలకు పెంచింది. కొత్త రేషన్‌ కార్డులు పొందిన వారందరూ ఇక నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు వైద్య సదుపాయం, ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశం లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్‌, జూలై, ఆగస్టు మూడు నెలలకు కలిపి ఒకేసారి గత నెలలో బియ్యం పంపిణీ చేశారు. కొత్త రేషన్‌ కార్డులపై బియ్యం సెప్టెంబర్‌ నెల నుంచి పంపిణీ చేయనున్నారని డీఎస్‌వో కె శ్రీనాథ్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు. రేషన్‌ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని, అర్హులైన వాళ్లు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

జిల్లాలో కార్డుల లెక్క ఇలా...

జిల్లాలో 12,168 కుటుంబాలకు కొత్తగా రేషన్‌ కార్డు లను జారీతోపాటు పాత కార్డుల్లో 30,260 మందిని చేర్చారు. వీరితోపాటు కొత్త కార్డులపై ఉన్న 62,622 మంది కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 92,882 మంది కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలగనున్నది. అంతకు ముందు ఆహార భద్రత కార్డులు 2,11,141 కార్డులు ఉండగా వీటిపై 6,32,753 మంది ఉన్నారు. అంత్యోదయ అన్న యోజన కార్డులు 12,257 ఉండగా వీటిపై 33,993 మంది, అన్నపూర్ణ కార్డులు 155 ఉం డగా 166 మంది ఉన్నారు. మొత్తం 2,23,553 కార్డుల్లో 6,66,912 మంది ఉన్నారు. ప్రస్తుత జారీ చేసిన కార్డులతో కలిసి మొత్తం 2,35,721 కార్డుల్లో 7,59,800 మంది రేషన్‌ కార్డుల ద్వారా లబ్ధి పొందనున్నారు.

Updated Date - Jul 23 , 2025 | 01:13 AM