Share News

సొంతిల్లు పేదవారి ఆత్మగౌరవ ప్రతీక

ABN , Publish Date - May 25 , 2025 | 12:50 AM

పేదవారి ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు అని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ తెలిపారు.

సొంతిల్లు పేదవారి ఆత్మగౌరవ ప్రతీక

కోనరావుపేట, మే 24 (ఆంధ్రజ్యోతి) : పేదవారి ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు అని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ తెలిపారు. కోనరా వుపేటలో మండల కేంద్రంలో శనివారం రెండో విడత లో 561 ఇందిరమ్మ ఇళ్ల మంజూరి ఉత్తర్వులు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝూతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము ఇచ్చిన హామీ మేర కు ఇంటిస్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇంది రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశామని తెలి పారు. వేములవాడ నియోజకవర్గంలో 3500 ఇందిర మ్మ ఇళ్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. నిర్ణీత సమయం, ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం ఇల్లు నిర్మించుకొని సహాయం పొం దాలన్నారు. 561 మంది లబ్ధిదారులను పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి ఉత్తర్వులు పంపిణీ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని, 400చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని స్పష్టం చేశారు. 4 దశలో గ్రీన్‌చానల్‌ ద్వారా ఆర్థిక సహాయం అందుతుం దని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కచ్చ కాయల ఎల్లయ్య, వైస్‌చైర్మన్‌ తాళ్లపెళ్లి ప్రభాకర్‌, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు కేతిరెడ్డి జగన్మో హన్‌ రెడ్డి, మండల అధ్యక్షుడు ఫిరోజ్‌ పాషాతో పాటు మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్‌ నాయకులు, తహ సీల్దార్‌ వరలక్ష్మి, హౌసింగ్‌ పిడి శంకర్‌, సంబంధిత అధికారు లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 12:50 AM