సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 60 మొబైల్ ఫోన్ల రికవరీ
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:12 AM
బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 60 మొబైల్ పోన్లను కరీంనగర్ టౌన్ పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పట్టుకున్నారు. 10 లక్షల రూపాయల విలువ ఉన్న ఈ 60 ఫోన్లను బాధితులకు కరీంనగర్ టౌన్ ఏఈసీపీ వెంకటస్వామి శనివారం అందజేశారు.
కరీంనగర్ క్రైం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 60 మొబైల్ పోన్లను కరీంనగర్ టౌన్ పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పట్టుకున్నారు. 10 లక్షల రూపాయల విలువ ఉన్న ఈ 60 ఫోన్లను బాధితులకు కరీంనగర్ టౌన్ ఏఈసీపీ వెంకటస్వామి శనివారం అందజేశారు. ప్రత్యేక పోలీసు బృందాలు కొంత కాలంగా బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీ కోసం సీఈఐఆర్ (సెంట్రల్ ఈక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా ప్రయత్నించారు. ఆయా ఫోన్ల లోకేషన్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ వన్, టూ, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలు నిరంతరం నిఘా ఉంచి, టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఈ ఫోన్లను గుర్తించాయి. ఫిర్యాదుదారులను పిలిపించి, తగిన ఆధారాలను పరిశీలించిన అనంతరం వారికి మొబైల్ ఫోన్లను అందజేశారు. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి మాట్లాడుతూ... మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదుతో పాటు పోలీసుల సాయంతో ఠీఠీఠీ.ఛ్ఛిజీట.జౌఠి.జీుఽ పోర్టల్‌లో మొబైల్ వివరాలను నమోదు చేయాలని సూచించారు. దీనివల్ల ఫోన్ దుర్వినియోగం కాకుండా బ్లాక్ చేయడంతోపాటు, తిరిగి రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నారు.