Share News

44 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం..

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:05 AM

మావోయిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ మెంబర్‌, అధికార ప్రతినిధి, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ చీఫ్‌ మల్లోజుల వేణుగోపాల్‌ అలి యాస్‌ సోనూ దాదా, అభయ్‌, భూపతి 44 ఏళ్ల ఆజ్ఞాతాన్ని వీడారు.

 44 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మావోయిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ మెంబర్‌, అధికార ప్రతినిధి, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ చీఫ్‌ మల్లోజుల వేణుగోపాల్‌ అలి యాస్‌ సోనూ దాదా, అభయ్‌, భూపతి 44 ఏళ్ల ఆజ్ఞాతాన్ని వీడారు. ఆయనను పెద్దపల్లి పెద్దన్నగా ఈ ప్రాంత ప్రజలు భావిస్తారు. మంగళవారం రాష్ట్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న, రూపేష్‌, పలువురు డివిజనల్‌ కమిటీ సభ్యులు 60 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయారు.

ఫ వరుస లేఖలతో కలకలం

రెండు నెలలుగా పార్టీ విధానాలను వ్యతిరేకి స్తూ మల్లోజుల విడుదల చేసిన లేఖలు కలకలం రేపాయి. ఆ లేఖలకు ప్రతిగా రాష్ట్ర అధికార ప్రతి నిధి జగన్‌, కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రాంచంద్రా రెడ్డి, సత్యనారాయణరెడ్డి సాయుధ పోరాటాన్ని వీడేది లేదంటూ స్పష్టం చేశారు. ఆ తర్వాత మల్లోజుల వరుసగా లేఖలు విడుదల చేయడంతో ఆయన లొంగిపోవడం ఖాయమని అంతా భావిం చారు. వారం రోజుల క్రితమే ఆయన హైదరాబాద్‌ పోలీసులకు లొంగిపోయారనే వార్తలు వెలువడ్డా యి. వేణు గోపాల్‌రావు సోదరుడు కోటేశ్వర్‌రావు విప్లవోద్యమంలోనే అమరడ య్యారు. ఆ సమయంలో ‘అమ్మ.. నేను పారి పోను, ప్రజల కోసం ప్రాణం ఇస్తా..’ అని అన్న వేణుగోపాల్‌రావు అనూ హ్యంగా పోలీసులకు లొంగిపోవడం చర్చ నీయాంశంగా మారింది. నిన్ను చూడా లంటూ.. పలుసార్లు కోరిన వేణుగో పాల్‌రావు తల్లి మల్లోజుల మధురమ్మ 2022 అక్టోబరులో అనారోగ్యంతో మృతి చెందింది. ఆ సమ యంలో ఆయన వస్తాడని పలువురు భావించారు.

ఫ కోటన్న స్ఫూర్తిగా..

పెద్దపల్లి పట్టణానికి చెందిన మధురమ్మ, వెంక టయ్య దంపతులకు మూడో సంతానంగా 1956 మే 10వ తేదీన మల్లోజుల వేణుగోపాల్‌ రావు జన్మించారు. పెద్దన్న ఆంజనేయులు ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘంలో ఉద్యోగం చేసి పద వీ విరమణ చేశారు. పెద్దపల్లి ప్రాంతంలో జరు గుతున్న అన్యాయాలు, భూస్వాములు, పెత్తందా రుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సోదరుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీ 1975లోనే కొండపల్లి సీతరామయ్య నాయకత్వంలో ఏర్పడిన సీపీఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌లో చేరారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న వేణుగోపాల్‌రావు 1981 ప్రాంతం లో అడవిబాట పట్టారు. పెద్దపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. 1977-78లో పెద్దపల్లి ఐటీఐలో రేడియో టీవీ కోర్సును అభ్యసించారు. అనంతరం బసంత్‌నగర్‌లో గల సిమెంట్‌ ఫ్యాక్టరీలో అప్రెంటీస్‌షిప్‌ చేశారు. ఆ తర్వాత బీకాం చదివారు.

ఫ అంచలంచెలుగా ఎదిగి..

మల్లోజుల వేణుగోపాల్‌ పీపుల్స్‌వార్‌, మావోయిస్టు పార్టీల్లో అంచలంచెలుగా ఎదిగారు. 1981లో పీపుల్స్‌వార్‌లో ఏటూరు నాగారం దళ సభ్యుడిగా చేరారు. 1982లో మహదేవపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. 1983లో విడుదలైన తర్వాత తిరిగి దళంలోకి వెళ్లారు. 1993లో దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ సెక్రెటరీగా, 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్ని కయ్యారు. పశ్చిమ కనుమలకు ఇరువైపులా కొత్త గెరిల్లా జోన్‌ ఏర్పాటు చేసేందుకు వేణుగోపాల్‌రావుకు పార్టీ కీలక బాధ్యతలను అప్పగించింది. 2007 నుంచి పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా పని చేస్తున్నారు. 2010 ఏప్రిల్‌లో దంతేవాడలో 76 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందిన ఘటనకు ప్రధాన సూత్రధారి వేణుగోపాల్‌ అని చెబుతారు. అదే ఏడాది కేంద్ర అధికార ప్రతినిధిగా నియమించారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా వేణుగోపాల్‌ బాధ్యతలు నిర్వహించారు. అభయ్‌ పేరిట లేఖలు విడుదల చేసేవారు. లాల్‌గఢ్‌ ప్రాంత ఉద్యమానికి, ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా నాయకత్వం వహించారు. ఆయన సహచరి సిడాం విమలచంద్ర అలియాస్‌ తారక్క అలియాస్‌ వత్సల జనవరి 1న మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయారు. సాహిత్యాభిరుచి ఉన్న వేణుగోపాల్‌ సాధన అనే కలం పేరిట కవిత్వం రాసే వారు.

Updated Date - Oct 15 , 2025 | 01:05 AM