బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలి
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:22 AM
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతుల విగ్ర హం ఎదుట బీసీ సంక్షేమ సంఘం నాయకులు నోటికి నల్లగుడ్డలు ధరించి మౌనదీక్ష చేపట్టారు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతుల విగ్ర హం ఎదుట బీసీ సంక్షేమ సంఘం నాయకులు నోటికి నల్లగుడ్డలు ధరించి మౌనదీక్ష చేపట్టారు. అంతకు ముందు జ్యోతిబాఫూలే, సావిత్రిబాయి ఫూలే దంప తుల విగ్రహాలకు బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫూలే దంపతుల విగ్ర హం ఎదుట బైటాయించి నోటికి నల్ల గుడ్డలు ధరించి మౌనదీక్షతో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి పార్లమెంట్ ఉభయ సభల్లో ఏకగ్రీవం తీర్మానం చేసి బిల్లును ఆమోదించాలన్నా రు. రాజ్యాంగ సవరణ చేసి అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లపై చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. అవసరమైతే ఢీల్లీలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటిని కూడా ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయ కులు తడక కమలాకర్, బోయిన శ్రీనివాస్, బూర అంజనేయులు, చెన్నమనేని రాజకుమార్, దుబాల కొండయ్య, తోట్ల రాములుయాదవ్, కందుకూరి రామాగౌడ్, తిరుపతి, రాజు, మల్లేశంయాదవ్, రవి, శ్రీనివాస్, సామల తిరుపతి, అనిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.