Share News

ప్రజావాణికి 318 దరఖాస్తులు

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:46 PM

ప్రజావాణి కార్యక్రమానికి 318 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌ తెలిపారు.

ప్రజావాణికి 318 దరఖాస్తులు

సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమానికి 318 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ప్రఫుల్‌దేశాయ్‌, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 11:46 PM