Share News

ప్రజావాణికి 288 దరఖాస్తులు...

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:03 AM

ప్రజావాణి కార్యక్రమానికి 288 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్‌ పమేలాసత్పతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

ప్రజావాణికి 288 దరఖాస్తులు...
దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పతి

సుభాష్‌నగర్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమానికి 288 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్‌ పమేలాసత్పతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే, లక్ష్మికిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్‌డీవోలు మహేశ్వర్‌, రమేశ్‌బాబు పాల్గొన్నారు.

ఫ ఆరు నెలలకు సంబంధించిన వేతనం ఇప్పించాలి

తనకు ఆరు నెలల నుంచి రావాల్సిన సగం వేతనాన్ని ఇప్పించాలని ఉపాధ్యాయురాలు టి శారదారెడ్డి కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని దుబ్బపల్లి మండలపరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్నట్లు తెలిపారు. తిమ్మాపూర్‌ మండలంలోని రామకృష్ణకాలనీలోగల ఎంపీయూపీఎస్‌లో పనిచేస్తున్న కాలంలో 2022 సెప్టెంబరు 22 నుంచి 2023 మార్చి 15 వరకు ప్రభుత్వ అనుమతితో అమెరికా వెళ్లినట్లు తెలిపారు. ఆ ఆరు నెలలకు సంబంధించిన సగం వేతనం ఇవ్వలేదన్నారు. ఈ విషయంపై 2024 జూన్‌ 4న జిల్లా విద్యాధికారి, ఆర్‌జేడీ వరంగల్‌, 2025 ఆగస్టు 4న కలెక్టర్‌, ఈనెల 4న డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కు వినతి పత్రాలు అందజేశానని తెలిపారు. అయినా తన సమస్యను పరిష్కరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.

Updated Date - Nov 18 , 2025 | 12:04 AM