ప్రజావాణికి 269 దరఖాస్తులు
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:29 AM
ప్రజావాణి కార్యక్రమానికి 269 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
సుభాష్‌నగర్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమానికి 269 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబధిత అధికారులకు పంపి వాటిని సత్వరమే పరిష్కరించేలా చూడాలని అఽధికారులను ఆదేశించారు. 15 సంవత్సరాలు నిండిన బాలికలు, 50 సంవత్సరాల పైన ఉన్న మహిళలు, దివ్యాంగులను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలని డీఆర్డీవో, మెప్మా పీడీలను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో చదివే బాలికలను ఈ సంఘాల్లో చేరేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ గుర్తింపు హాజరును ఉపాధ్యాయుల సాదారణ సెలవులతో సోమవారం నుంచి లింక్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తనాజీ వాఖడే, లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు పాల్గొన్నారు.