Share News

మద్యం దుకాణాలకు 2,635 దరఖాస్తులు

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:16 PM

జిల్లాలో 94 వైన్‌షాపులకు ఇప్పటి వరకు 2,635 దరఖాస్తులు అందాయని జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.

మద్యం దుకాణాలకు 2,635 దరఖాస్తులు

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 94 వైన్‌షాపులకు ఇప్పటి వరకు 2,635 దరఖాస్తులు అందాయని జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27న డ్రా ద్వారా వైన్‌షాపుల లైసెన్సీలను ఎంపిక చేయనున్నారు. 2023లో రెండు సంవత్సరాల కోసం నిర్వహించిన మద్యం టెండర్లలో 4,040 దరఖాస్తులురాగా ప్రస్తుతం టెండర్లలో 2,635 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో దరఖాస్తు ఫీజు రెండు లక్షలుండగా ప్రస్తుతం మూడు లక్షలకు పెంచారు. దీంతో దరఖాస్తులు తగ్గిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైన్‌షాపులకు దరఖాస్తులు తగ్గడంతో దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో ఐదు రోజులపాటు పొడిగించింది.

Updated Date - Oct 19 , 2025 | 11:16 PM