ప్రజావాణికి 263 దరఖాస్తులు
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:32 PM
ప్రజావాణి కార్యక్రమానికి 263 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆమె దరఖాస్తులు స్వీకరించారు.
సుభాష్‌నగర్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమానికి 263 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆమె దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలకు ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని సంబందిత ఆధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తనాజీవాకడే, లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డీటీడీవో పవన్‌కుమార్ పాల్గొన్నారు.
జింక్ కార్నర్‌లను ఏర్పాటు చేయాలి
ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో డయేరియా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో జింక్ కార్నర్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. సోమవారం ప్రజావాణి అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో రూపొందించిన స్టాప్ డయోరియా పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యఆరోగ్యశాఖ ఆద్వర్యంలో ఈనెల 31 వరకు స్టాప్ డయోరియా క్యాంపెయన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అందజేస్తారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో, పాఠశాలలో జింక్ కార్నర్‌లను ఏర్పాటుచేసి తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు అందుబాటులో ఉంచాలన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంఈవోలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.