Share News

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 150 అక్రమ కేసులు

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:52 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అక్రమంగా 150 మంది పై రౌడీ షీటర్‌ కేసులు పెట్టారని మాల మహా నాడు జాతీయకార్యదర్శి రాగుల రాములు అన్నా రు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 150 అక్రమ కేసులు

సిరిసిల్ల టౌన్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అక్రమంగా 150 మంది పై రౌడీ షీటర్‌ కేసులు పెట్టారని మాల మహా నాడు జాతీయకార్యదర్శి రాగుల రాములు అన్నా రు. మంగళవారం సిరిసిల్ల పట్టణం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాలలో ఉన్నవారిపై కూడా అక్రమంగా కేసులు పెట్టారు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక భూ కబ్జాలకు పాల్పడిన ఒక్కరిద్దరిపై కేసులు పెడితే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నిం చారు. ఒక్క కేసు ఉన్నవారిపైన రెండు కేసులు, రెండు కేసులు ఉన్నావారిపై నాలుగు అక్రమ కేసులు పెట్టారని ఉద్యమకారులపై కూడా కేసు లు పెట్టారని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు. 150 మందిపై పెట్టిన అక్రమ కేసులపై ఈనెల 16న సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తా వద్ద వచ్చి మాజీ మంత్రి కేటీఆర్‌, కొండూరు రవీందర్‌రావు, తోట ఆగయ్య సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక్క కేసులో ఉన్నవారిపై న్యాయమూర్తి అనుమతు లు లేకుండా అక్రమంగా రెండవ కేసు పెట్టి చ ట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. సిరిసిల్ల లో దళితుల భూములలో బీఆర్‌ఎస్‌ భవన్‌ ని ర్మించారా లేదా సమాధానం చెప్పాలని డిమాం డ్‌ చేశారు. సిరిసిల్ల శాంతినగర్‌లోని ఇందిరమ్మ ఇండ్లు, ఆయకట్టు కింద ఉన్న దళితుల వందల ఎకరాలు, టెక్స్‌టైల్‌ పార్కులో దళితుల భూము లు గుంజుకోలేదా అన్ని ప్రశ్నించారు. వీటిపైన కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తన భార్య పేరు మీద 3 ఎకరాలు భూమితో పాటు 30ఎకరాల భూమిని కూడా కబ్జాపెట్టాడని వీటి మీద ఆధారాలతో వస్తామ న్నారు. దళితుల పక్షాన కేకే మహేందర్‌రెడ్డి ఉ న్నాడని తనను మధ్యలోకి తీసుకురావద్దని అ న్నారు. ఈనెల 16న అంబేద్కర్‌ చౌరస్తా వద్దకు రాకుంటే ఉద్యమాన్ని చేపడతామన్నారు. మాట్ల మధు కూడా అంబేద్కర్‌ చౌరస్తా వద్దకు రావా లన్నారు. తెలంగాణ ఉద్యమ జెండా పట్టుకున్నా కేకే మహేందర్‌రెడ్డిని పట్టుకొని అగౌరవంగా మాట్లాడడం సరికాదన్నారు. ఈ సమావేశంలో నాయకులు కంసాల మల్లేశం, అన్నల్‌దాస్‌ భా ను, కొంపెల్లి విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 12:52 AM