Share News

లోక్‌ అదాలత్‌లో 12,856 కేసుల పరిష్కారం

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:00 AM

రాజీయే రాజమార్గమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ అన్నారు.

లోక్‌ అదాలత్‌లో 12,856 కేసుల పరిష్కారం

సిరిసిల్ల క్రైం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి) : రాజీయే రాజమార్గమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ అన్నారు. శనివారం సిరిసిల్ల జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్‌ అదాలత్‌ సంద ర్భంగా జిల్లా వ్యాప్తంగా 7బెంచ్‌ల ద్వారా 12,856 కేసులు పరిష్కరించి రూ.3 కోట్ల 88లక్షల 55వేల 607 చెల్లింపులు జరిగాయన్నారు. ఇందులో పిడిజెలో 14, 1వ అడిషనల్‌ సెషన్స్‌ జిల్లా కోర్టులో 7, సీనియర్‌ సివిల్‌ కోర్టులో 2, ప్రిన్సిపల్‌ జూనియర్‌సివిల్‌ కోర్టులో 168, 1వ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టులో 88, 2వ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టులో 137, వేములవాడ జూనియర్‌ సివిల్‌ కోర్టులో 641, సెకండ్‌ క్లాస్‌ కోర్టులో డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు 1459, డీఎల్‌ఎస్‌ఏలో బ్యాంకు పీఎల్‌సీలు 123, బీఎస్‌ఎన్‌ఎల్‌ పీఎల్‌సీలు 18, ట్రాఫిక్‌ చలాన్లు 10199 కేసులు పరిష్కారం అయ్యాయని ఆమె తెలిపారు. లోక్‌ అదాలత్‌ తీర్పు అంతి మం అన్నారు. జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ ద్వారా ఉచిత న్యాయసేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. 1వ అదనపు సెషన్స్‌ జిల్లా జడ్జి బి. పుష్పలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి లక్ష్మణాచారి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఏ. ప్రవీణ్‌, అదనపు జూనియర్‌ సివిల్‌జడ్జి కె. సృజన, జూనియర్‌ సివిల్‌ జడ్జి గడ్డం మేఘన, అడిషనల్‌ ఎస్పీ డి. చంద్రయ్య, సిరిసిల్ల బార్‌ అసోసియే షన్‌ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, లోక్‌ అదాలత్‌ సభ్యులు చింతోజు భాస్కర్‌, ఆడెపు వేణు, ఏపీపీ పెంట శ్రీని వాస్‌, సీనియర్‌, జూనియర్‌, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 12:00 AM