‘ప్రజావాణి’కి 120 దరఖాస్తులు..
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:55 PM
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని విన్నపాలు సమర్పించుకున్నా రు.
సిరిసిల్ల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని విన్నపాలు సమర్పించుకున్నా రు. సోమవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా వాణికి 120 దరఖాస్తులు వచ్చాయి. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అర్జీలు స్వీక రించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదే శించారు. రెవెన్యూ శాఖకు 28, డీఆర్డీవోకు 27, హౌసింగ్ శాఖకు 16, ఎస్డీసీకి 12, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారికి ఐదు చొప్పున, జిల్లా విద్యాధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారికి నాలుగు చొప్పున, ఎస్పీ కార్యాల యం 3, ఏడీ(ఎస్‌ఎల్ ఆర్), జిల్లా పౌర సరఫరాల అధికారి, అటవీ శాఖ, సెస్‌కు రెండు చొప్పున, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా రవాణా శాఖ అధికారి, సీపీవో, డీఏవో, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి, ఎల్డీఎం, జీఎం ఇండస్ట్రీస్, ఎంపీడీవో తంగళ్ళపల్లికి ఒకటి చొప్పున వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.