సంచితోపాటు సన్నబియ్యం
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:21 AM
రేషన్ షాపుల ద్వారా సరుకులను తీసుక వెళ్లేందుకు ప్రభుత్వం వచ్చే నెల నుంచి పర్యావరణహితమైన సం చులను సరఫరా చేయనున్నది. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు పొందిన కుటుంబాలకు, పాత కార్డుల్లో చేర్పులు, మార్పుల్లో భాగంగా అదనంగా చేర్చిన కుటుంబ సభ్యులకు కూడా వచ్చే నెల నుంచి బియ్యం అందించనున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రేషన్ షాపుల ద్వారా సరుకులను తీసుక వెళ్లేందుకు ప్రభుత్వం వచ్చే నెల నుంచి పర్యావరణహితమైన సం చులను సరఫరా చేయనున్నది. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు పొందిన కుటుంబాలకు, పాత కార్డుల్లో చేర్పులు, మార్పుల్లో భాగంగా అదనంగా చేర్చిన కుటుంబ సభ్యులకు కూడా వచ్చే నెల నుంచి బియ్యం అందించనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ మాసానికి గాను ప్రభుత్వం జిల్లాలో గల రేషన్ వినియోగదా రులకు 4,403 టన్నుల సన్న బియ్యాన్ని కేటాయించింది.
రాష్ట్రంలో ఇస్తున్న సన్నబియ్యం గురించి, ప్రభుత్వం హామీ ఇచ్చిన అభయ హస్తం పేరిట ఆరు గ్యారంటీ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు రేషన్ కార్డులు కలిగిన వినియోగదారులకు సంచులను పం పిణీ చేయాలని నిర్ణయించారు. ఈ సంచులను 15 కిలోల వరకు సరుకులు పట్టే విధంగా తయారు చేశారు. ఈ సంచులపై సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు, ఇందిరాగాంధీ ఫొటోతో గల అభయహస్తం పేరిట ఆరు గ్యారంటీ పథకాలు మహాలక్ష్మి, గృహలక్ష్మి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా పేరిట గల లోగోను ముద్రించారు. అలాగే ‘అందరికి సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అనే నినాదం ప్రగతి పథం... సకలజన హితం... మన ప్రజా ప్రభుత్వం అనే ట్యాగ్ లైన్‌తో సంచులను ముద్రించారు. రేషన్ షాపులకు వచ్చి పీఓఓస్ మిషన్లపై వేలి ముద్రలు వేసిన తర్వాత బియ్యంతోపాటు సంచులను కూడా అందజేయనున్నారు. ఈ సంచుల్లో ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్న వాళ్లు మాత్రమే బియ్యం తీసుక పోవచ్చు. అనంతరం మార్కెట్‌కు సంచులను తీసుకువెళితే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నదనే ప్రచారం అవుతుందనే ఉద్ధేశ్యం తోనే సంచులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తు న్నది. సంచులు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు చేరుకుంటున్నాయి.
ఫ కొత్త రేషన్ కార్డుదారులకు ఈ నెల నుంచే
రెండు, మూడు నెలల నుంచి కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారితోపాటు పాత కార్డుల్లో చేర్పులు, మార్పుల వల్ల కొత్తగా చేరిన కుటుంబ సభ్యుల పేరిట కూడా బియ్యం ఇవ్వనున్నారు. ఆ మేరకు డైనమిక్ కీ రిజిష్టర్ రూపొందించారు. వాటి ఆధారంగా జిల్లాలో గల 413 రేషన్ డీలర్లకు బియ్యాన్ని కేటాయించారు. భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్, జూలై, ఆగస్టు మూడు మాసాలకు కలిపి జూన్‌లో ఒకేసారి సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. జూన్ నెలకు ముందే మూడు నెలల అలాట్‌మెంట్ పూర్తి కాగా, జూన్ నుంచి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి ఈ నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు.
జిల్లాలో 12,168 కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డు లను జారీ చేయడంతో పాటు పాత కార్డుల్లో 30,260 మందిని చేర్చారు. వీరితో పాటు కొత్త కార్డులపై ఉన్న 32,362 మంది కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 62,622 మంది కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలగ నున్నది. అంతకు ముందు ఆహార భద్రత కార్డులు 2,11,141 కార్డులు ఉండగా, వీటిపై 6,32,753 మంది ఉన్నారు. అంత్యోదయ అన్న యోజన కార్డులు 12,257 ఉండగా, వీటిపై 33,993 మంది, అన్నపూర్ణ కార్డులు 155 ఉండగా, 166 మంది ఉన్నారు. మొత్తం 2,23,553 కార్డుల్లో కార్డుల్లో 6,66,912 మంది ఉన్నారు. మొత్తం 2,35,721 కార్డుల్లో 7,29,534 మంది రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం రేషన్ కార్డులపై కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డులను ఏరివేసేం దుకు 2015లో కొత్తగా దరఖాస్తులు తీసుకుని ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. అంతేగాకుండా రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా చేసింది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బీఆర్‌ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. కానీ రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిలిపి వేసింది. అనేక మంది రేషన్ కార్డుల కోసం ఇబ్బందులు పడ్డారు. 2019 నుంచి 2023 నవం బర్ వరకు అప్పటి ప్రభుత్వం ఒకసారి మాత్రమే 2021 అక్టోబర్‌లో కొందరికి రేషన్ కార్డులను మంజూరు చేసిం ది. ఆ తర్వాత కార్డులు మంజూరు చేయలేదు. ఏడాది న్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు ప్రజాపాలనలో, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి ఎట్టకేలకూ ఏడాదిన్నర తర్వాత కొత్త రేషన్ కార్డులను జారీ చేశారు. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ డీఎస్‌ఓ శ్రీనాథ్‌ను వివరణ కోరగా రేషన్ షాపుల ద్వారా వినియోగదా రులకు ప్రభుత్వం సరపరా చేసిన సంచులను పంపిణీ చేయనున్నాం. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా వచ్చే నెల సరుకులు పంపిణీ చేయనున్నారు. 4403 టన్నుల బియ్యం కోటా పెరిగిందన్నారు.