NEET UG 2025: 9 నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:52 AM
వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్‌కు కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్టు 9న ప్రారంభమై అక్టోబరు-10తో ముగియనుంది.
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్‌కు కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్టు 9న ప్రారంభమై అక్టోబరు-10తో ముగియనుంది. రాష్ట్రంలో కన్వీనర్, బీ, సీ కేటగిరి సీట్ల కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు ముగిసింది.
వాస్తవానికి జూలై 12న నీట్ షెడ్యూల్ ప్రకటించి విడుదల చేయగా స్థానికత అంశంపై పలువురు విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో రాష్ట్ర కౌన్సెలింగ్‌ను కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4090 ఎంబీబీఎస్ సీట్లుండగా, ప్రెవేటులో 4600 సీట్లున్నాయి.