కబడ్డీ పోటీల విజేత ఆలగడప
ABN , Publish Date - Jan 18 , 2025 | 01:10 AM
హుజూర్‌నగర్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి సందర్భంగా హుజూర్‌నగర్ మున్సిపల్ పరిధిలోని మాధవరాయనిగూడెంలో నాలుగురోజుల పా టు నిర్వహించిన తెలుగు రాష్ర్టాల స్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం ముగిశా యి.

హుజూర్‌నగర్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి సందర్భంగా హుజూర్‌నగర్ మున్సిపల్ పరిధిలోని మాధవరాయనిగూడెంలో నాలుగురోజుల పా టు నిర్వహించిన తెలుగు రాష్ర్టాల స్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం ముగిశా యి. మొదటి బహుమతి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడపకు చెం దిన వల్లబుదాసు సోమయ్య మెమోరియల్‌కు రూ.20వేల నగదు, షీల్డ్, ద్వితీ య బహుమతి నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన మోదాల మురళి మెమోరియల్‌కు రూ.18 వేలు, మెమెంటో, తృతీయ బహుమతి మాధవరాయనిగూడెం గ్రామ కమిటీకి రూ.16వేలు, మెమెంటో, నాలుగో బహుమతి మునగాల మండలం బరాఖత్‌గూడెం మేకల రాజారావు టీమ్‌కు రూ.14 వేలు, మెమెంటో, ఐదవ బహుమతి గరిడేపల్లి మండలం సర్వారం ఫోకస్‌క్లబ్‌కు రూ. 13 వేలు, మెమోంటో అందజేశారు విజేతలకు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు, నగదు అందజేశారు.