Justice Sudarshan Reddy: ప్రజాస్వామిక వాదులను ఏకం చేయాలి
ABN , Publish Date - Jul 28 , 2025 | 04:29 AM
సమాజంలో భిన్నాభిప్రాయాలు, విభిన్న ఆలోచనల మధ్య నిరంతరం సంభాషణ, తద్వారా లోతైన సంఘర్షణ జరగడం ద్వారా ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు.
రాహుల్, రేవంత్ బాధ్యత తీసుకోవాలి.. పుస్తకావిష్కరణలో వక్తలు
హైదరాబాద్ సిటీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): సమాజంలో భిన్నాభిప్రాయాలు, విభిన్న ఆలోచనల మధ్య నిరంతరం సంభాషణ, తద్వారా లోతైన సంఘర్షణ జరగడం ద్వారా ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రముఖ సామాజిక వేత్త ఆచార్య హరగోపాల్ ఇంటర్వ్యూలు, వ్యాసాల సంపుటి ‘‘శాంతి చర్చలు - ప్రజాస్వామిక అన్వేషణ’’ పుస్తకాన్ని పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో అసమానతలు తీవ్రమయ్యాయని, వాటిమీద లోతైన చర్చ జరగాల్సిన అవసరముందన్నారు.
శాంతి చర్చల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. కార్పొరేట్ల ప్రయోజనాలకు ఆటంకం కలగకూడదనే... మోదీ ప్రభుత్వం శాంతి చర్చలకు అంగీకరించడం లేదన్నారు. ప్రజాస్వామ్య విలువలతో సారూప్యం కలిగిన వారందరినీ ఒక్కటి చేయాల్సిన బాధ్యత రాహుల్, రేవంత్‌రెడ్డి మీదే ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ ప్రమాణాలకు లోబడి న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాలని సూచించారు. ఆచార్య హరగోపాల్ మాట్లాడుతూ.. యుద్ధం కంటే శాంతి ఎంతో గొప్పదని అన్నారు. ఈ పుస్తకాన్ని శాంతి చర్చల సాధనలో ముఖ్య పాత్ర పోషించిన అమరుడు ఎస్.ఆర్.శంకరన్‌కు అంకితం ఇచ్చినట్లు ప్రకటించారు.