Temple Visit: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ABN , Publish Date - Sep 06 , 2025 | 05:02 AM
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరే్‌షకుమార్ సింగ్ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు.
తిరుచానూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరే్‌షకుమార్ సింగ్ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో హరీందర్‌నాథ్ తదితరులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వదించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారు సేవలో తెలంగాణ సీఎస్

తిరుమల, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.