Share News

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

ABN , Publish Date - Jan 03 , 2025 | 12:30 AM

న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
క్లాక్‌టవర్‌ సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేసిన సమగ్రశిక్ష ఉద్యోగులు

నల్లగొండ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎ్‌సఏ ఉద్యోగుల సమ్మె గురువారం నాటికి 24వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు గడియారం సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, 24 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ హోదాలో హామీ ఇచ్చి, ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ, రాజు, సీఐటీయూ జిల్లా నాయకులు దండెంపల్లి సత్తయ్య, సంఘం నాయకులు మహేందర్‌, క్రాంతికుమార్‌, చంద్రశేఖర్‌, నీలాంభరి, మంజుల, సావిత్రి, పుష్పలత, చౌడోజు శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 12:30 AM