Jishnu Dev Varma: పతిభావంతుల ఎంపికే లక్ష్యం కావాలి
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:29 AM
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సులో గవర్నర్
హైదరాబాద్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రతిభావంతులను ఎంపిక చేయడమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ల లక్ష్యం కావాలని, నియామక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.
నల్సార్ యునివర్సిటీలో జరుగుతున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ స్థాయి సదస్సు ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో టీఎ్‌సపీఎ్‌ససీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంతోపాటు 25 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.