భక్తి తన్మయత్వంలో...
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:33 AM
సిరిసిల్ల మానేరు, మూలవాగుల తీరప్రాంతాలు మాఘ అమావాస్య జాతరలతో సందడిగా మారాయి. సంప్రదాయాల పరంపరకు అద్దం పడుతూ బుధవారం జిల్లా వ్యాప్తంగా జాతరలకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే శివరాత్రి వరకు జాతరలు సాగుతాయి.

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సిరిసిల్ల మానేరు, మూలవాగుల తీరప్రాంతాలు మాఘ అమావాస్య జాతరలతో సందడిగా మారాయి. సంప్రదాయాల పరంపరకు అద్దం పడుతూ బుధవారం జిల్లా వ్యాప్తంగా జాతరలకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే శివరాత్రి వరకు జాతరలు సాగుతాయి. జాతరలకు జనం తరలివెళ్లి భక్తిశ్రద్ధలతో ఆయా దేవాలయాల్లో పూజలు చేస్తారు. జిల్లాలో సాగిన మాఘ అమావాస్య జాతరలకు బొమ్మల దుకాణాలతో సందడిగా మారింది. సిరిసిల్ల మానేరు తీరంలో బొమ్మల దుకాణాలు జాతరకు ప్రత్యేక శోభను తెచ్చింది. జిల్లాలోని మానేరు, మూలవాగు తీరాల్లో దేవతామూర్తుల కల్యాణాలు, ప్రత్యేక కార్యక్రమాలతో సాగిన జాతరల్లో భక్తులు తన్మయత్వంతో పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మూడు జాతరలు ముచ్చటగా సాగాయి. సిరిసిల్ల మానేరు వాగులో గంగభవాని జాతర, మడలేశ్వరస్వామి జాతర, మిడ్‌మానేరు కరకట్ట వద్ద రామప్ప రామలింగేశ్వరస్వామి జాతరలు సాగాయి. మూడు దేవాలయాల్లో స్వామివారి కల్యాణాలను వైభవంగా నిర్వహించారు. మానేరు తీరంలో గంగమ్మ దేవస్థానం వద్ద గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించుకున్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీమడలేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణం, నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కరకట్ట వద్ద రామప్ప రామలింగేశ్వర స్వామి కల్యాణాలు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల జాతరలు, కల్యాణోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ప్రకాష్, కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, గడ్డం నర్సయ్య, అడెపు చంద్రకళలు స్వామివారిని దర్శించుకున్నారు. టెక్స్‌టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్లు జిందం కళచక్రపాణి, సామల పావని, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రజక సంఘం గౌరవ అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, తదితరులు స్వామివారలను దర్శించుకున్నారు.
ఊరురా జాతరలు...
ఎల్లారెడ్డిపేట : మండల కేంద్రంతో పాటు అక్కపల్లి, గొల్లపల్లి, బొప్పాపూర్, కోరుట్లపేట, వెంకటాపూర్ తదితర గ్రామాల్లో బుధవారం మాఘ అమావాస్య వేడుకలు జరిగాయి. అక్కపల్లి గ్రామ శివారులోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, కోనరావుపేట, సిరిసిల్ల, ముస్తాబాద్, సిరికొండ, తదితర మండలాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రామలింగేశ్వరస్వామి, హనుమాన్, మల్లన్న ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీకేశవ పెరుమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం తదితర పూజలను నిర్వహించారు. స్వామి కల్యాణ వేడుకలను జరిపించారు. వైద్యుడు సత్యనారాయణస్వామి ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. గొల్లపల్లిలోని గాలం గుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన పాతూరి పుష్పలత-మల్లారెడ్డి దంపతుల కొడుకు నర్సింహారెడ్డి-లావణ్య ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కోరుట్లపేట, వెంకటాపూర్‌లోని గంగమ్మ, ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఏఎంసీ చైర్‌పర్సన్ సబేరాబేగం, ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీడీవో సత్తయ్య, తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఫ ముస్తాబాద్ : మండల కేంద్రంలోని శ్రీస్వయంభూ వెంకటే శ్వరస్వామి ఆలయ వద్ద, రామలక్ష్మణపల్లెలో మానేరు తీరంలోని రామాలయం, పోతుగల్‌లో రామాలయం, చీకోడ్‌లో లక్ష్మీనర్సింహ స్వామి, కొండాపూర్‌లో ఆలయం వద్ద మాఘఅమావస్య జాతర బుధవారం ఘనంగా నిర్వహించారు. చీకోడ్, ముస్తాబాద్‌లో ఎడ్ల బండ్ల ప్రదర్శన ట్రాక్టర్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మాజీ ఎంపీపీ శరత్‌రావు, మాజీ జడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సురేంద ర్‌రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, జాల భిక్షప తి, రవీందర్‌రెడ్డి, కంచం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
ఫ వేములవాడ కల్చరల్ : వేములవాడ మండలం కొడుముం జ రామప్ప శ్రీరామలింగేశ్వర జాతర ఘనంగా నిర్వహించారు. శ్రీ స్వామివారికి కల్యాణం నిర్వహించారు.కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
ఫ వేములవాడ రూరల్ : మండలంలోని నాగాయపల్లిలో బుధ వారం దుబ్బరాజేశ్వరస్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారి రథోత్సవం నిర్వహించారు. స్వామివార్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మార్కెట్ కమి టీ చైర్మన్ రొండి రాజు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి తదితరులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి స్వామివారి కండువా కప్పి ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఫ చందుర్తి : మండలంలోని జోగాపూర్, మల్యాల గ్రామాల్లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాల్లో బుధవారం జాతర ఉత్సవా లు ఘనంగా జరిగాయి. శ్రీరాములవారి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ జడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మ్యాకల గణేష్, నాగం రాజ మల్లయ్య, ధర్మపురి శ్రీనివాస్, మ్యాకల పర్శరాములు, వెంకట్‌రాములు, రా ము, గణేష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
అలాగే తిమ్మాపూర్-నర్సింగాపూర్ గ్రామాల శివారులోని శ్రీలోం క వీరహనుమాన్ జాతర వైభవం గా జరిగింది. జాతరకు అధిక సం ఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కు లు చెల్లించుకుంటున్నారు. భక్తుల రాక సాయంత్రం కొనసాగింది.
ఫ కోనరావుపేట : మండలంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడా యి. మామిడిపల్లి శ్రీ సీతారాముల ఆలయం, నాగారం కోదండరామ స్వామి ఆలయం, మల్కపేట రా మాలయం, ధర్మారం వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిట లాడాయి. మామిడిపల్లి శ్రీ సీతారాముల స్వామివారిని సుమారు 50వేల మంది భక్తులు పా ల్గొని దర్శించుకున్నారు. స్వామివారిని బీఆర్‌ఎస్ వేములవాడ ని యోజకవర్గ ఇన్‌చార్జి చెలిమెడ లక్ష్మీనరసింహారావు, ఏనుగు మనో హర్‌రెడ్డి, రాఘవరెడ్డి, బండ నర్సయ్య, రామ్మోహన్‌రావు, మల్యాల దేవయ్య, గోపు పరశురాములు, బీజేపీ మండల అధ్యక్షుడు బాలా జీ, మాజీ జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, బైరగోని సురేష్ తదితరులు దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేములవాడ ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, నాగారం కోదండరామ స్వామి ఆలయ కమిటీ సభ్యులు చెన్నమనేని శ్రీకుమార్ ఏర్పాట్లు చేశారు. మామిడి పల్లి ఆలయ ఏర్పాట్ల పర్యవేక్షణలో అధికారులు గుట్ట శ్రావణ్, బ్ర హ్మన్నగారి శ్రీనివాస్, డి.మహిపాల్‌రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, వెం కట ప్రసాద్, నూగూరి నరేందర్, ఎస్సై ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నాగారం కోదండరామస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన మామిడిపల్లి శ్రీసీతారాములస్వా మిని బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. అర్చకులు కృష్ణహరి, ఆలయ ఈవో వినోద్‌రెడ్డి స్వాగతం పలికి ప్ర త్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, మా ర్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయలు ఎల్లయ్య, మండల అధ్యక్షుడు ఫిరోజ్‌పాషా, నాగారం ఆలయ చైర్మన్ శ్రీకుమార్ ఉన్నారు.
ఫ ఇల్లంతకుంట : మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఉత్సవం భక్తిప్రపత్తుల మధ్య బుధవారం జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు, అన్నపూజ కార్యక్రమం సా యంత్రం ఆలయం చుట్టు బండ్ల ప్రదక్షిణ జరిగింది. ఉత్సవంలో పలు గ్రామాల భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ఫ వీర్నపల్లి : మండలంలోని పలు దేవాలయాల్లో భక్తులు మొ క్కులు చెల్లించుకున్నారు. రంగంపేట బుగ్గ రామేశ్వరస్వామి ఆల యం మాఘ అమావాస్య జాతరకు భక్తులు పెద్దఎత్తున తరలివ చ్చి పూజలుచేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్య క్రమాన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కాశీరాం తెలి పారు. ఎస్‌ఐ ఎల్లాగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పా టు చేశారు.
ఫ గంభీరావుపేట : మండలంలోని మల్లారెడ్డిపేటలో బుధవా రం శ్రీఆంజనేయస్వామి జాతరకు వేలాదిగా భక్తులు తరలివచ్చా రు. అంజన్న ఆలయ సమీపాన ఉన్న గుండలో స్నానమాచరించి, దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ప్రగాడ నమ్మకం. ఈ సంవత్సరం కూడ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నాప్స్‌కాబ్ చైర్మన్ కొం డూరు రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, పలువురు నాయకులు శ్రీస్వామివారిని దర్శించుకున్నారు.