Jagga Reddy: సీఎం రేవంత్ నిధుల కోసం ఢిల్లీకెళ్తే.. కేసీఆర్ కుటుంబం.. లిక్కర్ దందా కోసం వెళ్లింది
ABN , Publish Date - Jul 09 , 2025 | 04:10 AM
పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు వెళతారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా..
కేటీఆర్ విదేశాలకెందుకెళ్తున్నాడు?
కేటీఆర్‌కు సిస్టర్, బ్రదరిన్లా స్ట్రోకు
అందుకే పిచ్చిపిచ్చిగా మట్లాడుతున్నడు
రేవంత్ జడ్పీటీసీ స్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రి అయ్యారు
నేను కౌన్సిలర్‌గా, 3 సార్లు ఎమ్మెల్యేను
కేటీఆర్‌కు రాజకీయ అనుభవమెంత?
కేసీఆర్ సవాల్ విసిరితేనే రేవంత్‌రెడ్డి వస్తారు: తూర్పు జగ్గారెడ్డి
హైదరాబాద్, జూలై 8(ఆంధ్రజ్యోతి): పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు వెళతారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందాల కోసం ఢిల్లీకి వెళితే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీకెళ్లారన్నారు. సహజంగా అందరికీ సన్‌స్ట్రోక్ తగులుతుందని, కేటీఆర్‌కు మాత్రం సిస్టర్ స్ట్రోక్, బ్రదరిన్లా స్ట్రోక్ తగిలిందని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ ఈ మధ్య నెలలో 20 రోజులు విదేశాల్లోనే ఉంటున్నారని, అందుకే ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి షెడ్యూల్ తెలియట్లేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి నిధులు, ఎరువులు.. నీళ్ల పంచాయితీ కోసం సీఎం రేవంత్ కేంద్రం చుట్టూ తిరుగుతున్నారన్నారు. కేటీఆర్‌కు ఏం పనుందని విదేశాల చుట్టూ తిరుగుతున్నాడని నిలదీశారు. కేసీఆర్ కోటాలో నేరుగా ఎమ్మెల్యే అయిపోయిన కేటీఆర్‌కు.. రాజకీయ ఒడిదుడుకులు ఏం తెలుసునని ప్రశ్నించారు. జడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి దాకా ఎదిగిన అనుభవం రేవంత్‌దన్నారు. తానూ ఒకసారి కౌన్సిలర్, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి టీపీసీసీకి కార్యనిర్వాహక అధ్యక్షుడినయ్యానన్నారు. తమ రాజకీయ అనుభవం ముందు.. కేటీఆర్ అనుభవమెంతని ప్రశ్నించారు. బూతులు, తిట్ల పురాణాలను స్టార్ట్ చేసిందే కేసీఆర్ అన్నారు. ఆయన మాటలనే కాస్త పాలిష్ చేసి సీఎం రేవంత్ వాడుతున్నారని జగ్గారెడ్డి చెప్పారు.
ఎమ్మెల్యేలు ఎక్కడ చర్చలు చేస్తారన్న జ్ఞానం కూడా లేదా?
మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు ఎక్కడ చర్చలు చేస్తారన్న జ్ఞానం కూడా లేదా? అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్, హరీశ్ రావు మరోమారు సవాళ్లు విసిరితే ఈసారి చర్చకు తాను వస్తానన్నారు. చర్చకు రమ్మంటూ కేసీఆర్ సవాల్ విసిరితేనే సీఎం రేవంత్ వస్తారని చెప్పారు. ‘‘పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతలను వేధించారు. నాపైనా నిఽఘా పెట్టారు. నాకు అప్పులు తప్ప ఆస్తులు లేవని నిఘాలో తేలింది. భూముల పంచాయతీ ఏమైనా ఉందా అని అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రాస్‌తో విచారణ చేయించారు. ఎక్కడా ఏమీ లేకపోవడంతో చివరికి పాస్‌పోర్టు కేసు పెట్టారు’’ అని జగ్గారెడ్డి చెప్పారు.