J. Mohan Nayak: ఆర్‌అండ్‌బీ ఈఎన్సీగా మోహన్ నాయక్
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:05 AM
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)గా జే.మోహన్ నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)గా జే.మోహన్ నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోహన్‌నాయక్ ప్రస్తుతం శాఖలో రహదారుల విభాగం చీఫ్ ఇంజినీర్(సీఈ)తో పాటు, రోడ్ డెవల్‌పమెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఆయనకు పదోన్నతి కల్పించడంతో పాటు ఈఎన్సీగా నియమించింది. అయితే ఆర్ అండ్ బీలో సర్వీస్ రూల్స్ అంశం తేలకపోవడంతో శాఖలోని అన్ని స్థాయిలు ఇంఛార్జి పోస్టులతోనే కొనసాగుతున్నాయి.
ఈ కారణంగానే మోహన్ నాయక్‌ను కూడా ఇంఛార్జి ‘ఇంజినీర్ ఇన్ చీఫ్’గానే ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. శాఖలో ప్రస్తుతం ఇంఛార్జి ఈఎన్సీగా జయభారతి కొనసాగుతుండగా మోహన్‌నాయక్ కూడా ఈఎన్సీగా రావడంతో ఒకటి, రెండ్రోజుల్లో వీరిద్దరికీ శాఖలు ఖరారు కానున్నాయి.