IRRI: వరి సాగులో యూరియా వాడకం తగ్గనుంది!
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:57 AM
రానున్న రోజుల్లో నూతన వరి వంగడాలతో ఇది సాధ్యమేనని చెప్పారు. దీని వల్ల నేల నాణ్యతతోపాటు ప్రజల ఆరోగ్యమూ మెరుగుపడుతుందని తెలిపారు. రాజేంద్రనగర్‌లోని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘‘భవిష్యత్తు బాగు కోసం వరి పరిశోధన’’ అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో ఆయన పాల్గొన్నారు.

భవిష్యత్తులో కొత్త వంగడాలతో సాధ్యమే
ఇర్రి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అజయ్ కోహ్లీ
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): వరి సాగులో యూరియా వాడకాన్ని తగ్గించేలా పరిశోధనలు జరుగుతున్నాయని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇర్రి) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, శాస్త్రవేత్త అజయ్ కోహ్లీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నూతన వరి వంగడాలతో ఇది సాధ్యమేనని చెప్పారు. దీని వల్ల నేల నాణ్యతతోపాటు ప్రజల ఆరోగ్యమూ మెరుగుపడుతుందని తెలిపారు. రాజేంద్రనగర్‌లోని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘‘భవిష్యత్తు బాగు కోసం వరి పరిశోధన’’ అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ వరి పరిఽశోధన సంస్థ రూపొందించిన వరి వంగడాలతో ఆసియా ఖండంలో ఆహార భధ్రత సాధ్యమైందని, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ నుంచి విడుదలైన ఐఆర్-8, ఐఆర్-64 రకాలు అత్యధికంగా సాగులో ఉన్నాయని చెప్పారు.
తద్వారా భారత్‌లో వరి సాగు, దిగుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు గ్రహీత మహంతి మాట్లాడుతూ ఆగ్నేయ ఆసియా దేశాల అవసరాలకు అనుగుణంగా తెలంగాణలో వరి సాగును ప్రోత్సహించాలని, తద్వారా రైతుల ఆదాయంతోపాటు ఎగుమతులు పెరుగుతాయన్నారు. అంతకుముందు యూనివర్సిటీలోని వరి పరిశోధన సంస్థను అజయ్‌కోహ్లీ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పరిశోధనల గురించి శాస్త్రవేత్తలతో మాట్లాడి, వారిని అభినందించారు. అనంతరం సచివాలయానికి వెళ్లి ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో భేటీ అయ్యారు.