తప్పుడు కేసులు పెట్టి భయపెడుతున్నారు...
ABN , Publish Date - Jan 21 , 2025 | 11:26 PM
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నరని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు.
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
నస్పూర్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నరని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. 18వ వార్డు తీగల్‌పహాడ్‌కు చెందిన బీఆర్‌ఎస్ ప్రశాంత్ అనే కార్యకర్తపై అక్రమంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేయించడంలో కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని వచ్చే 2028లో తాము అధికారంలోకి వస్తామని, ప్రతి దానికి సమాధానం అప్పుడు వస్తుందన్నారు. ఇంటి ముందు యువతికి చెందిన ఈ-మెయిల్ ఐడీని మరొక వ్యక్తి ఓపెన్ చేసి తప్పుడు సమాచారం సెండ్ చేయడం వలన ఆ యువతి ఉద్యోగం ఆగిపోయిందన్నారు. యువ తికి అన్యాయం జరిగిందని అడిగినందుకు కందుల ప్రశాంత్‌పై అక్రమం కేసు నమోదు చేయించార న్నారు. సోమవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని ఆర్థరాత్రి విచారణ పేరిట ఇళ్లకు వెళ్లి విచారణ చేయడమేమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు సంబంధం లేకుంటే బాధితులను పోలీసులు ఎందుకు బెదిరి స్తున్నరన్నారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులకు పిర్యాదు చేయనున్నట్లు దివాకర్ రావు వెల్లడించారు. ప్రశాంత్ పెట్టిన అక్రమ కేసు రాజకీయ కక్షతో పెట్టారని, దీనిని ఖండిస్తున్నమన్నారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, నాయకులు వంగ తిరుపతి, గోగుల రవీందర్ రెడ్డి, పానుగంటి సత్తయ్య, సంపత్ కుమార్, జనార్థన్, రవి తదితరులు పాల్గొన్నారు.