నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్....!
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:07 AM
ఇంటర్మీడి యట్ ప్రాక్టికల్ పరీక్షలను ఈసారి మాస్ కాపీయిం గ్‌కు అవకాశం లేకుండా నిఘా నీడలో నిర్వహించేం దుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఫిబ్ర వరి 3వ తేదీ నుంచి 20 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలపై నిఘాను పటిష్టం చేసింది.

-జూనియర్ కళాశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
-నేటి నుంచి 20 రోజులపాటు పరీక్షలు
-జిల్లాలో 39 కేంద్రాలు, 7వేల మంది విద్యార్థులు
-ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు
మంచిర్యాల, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడి యట్ ప్రాక్టికల్ పరీక్షలను ఈసారి మాస్ కాపీయిం గ్‌కు అవకాశం లేకుండా నిఘా నీడలో నిర్వహించేం దుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఫిబ్ర వరి 3వ తేదీ నుంచి 20 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలపై నిఘాను పటిష్టం చేసింది. గతంలో ఎన్న డూ లేనివిధంగా సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ఇంటర్ బోర్డు కార్య దర్శి కృష్ణ ఆదిత్య ఇటీవల జిల్లాలోని ఇంటర్ అధి కారులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశా లు జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లోని ప్రయోగశాలలు గల గదుల్లో సీసీ కెమెరాలను బి గించే పనిని హైదరాబాద్ లోని ఒక సంస్థకు అప్ప గించింది. ఇందుకోసం ఒక్కో కళాశాలకు ప్రభుత్వం 12వేల రూపాయలు కేటాయించింది. ఆమేరకు జి ల్లాలోగల కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కూడా పూర్తి కావచ్చింది.
7వేల పైచిలుకు మంది విద్యార్థులు...
ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో మొ త్తం 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్, 17 రెసిడెన్షియల్ కళాశాల లు, 12 ప్రైవేటు కళాశాలలు ఉండగా జనరల్, వొకేష నల్, బ్రిడ్జి కోర్సులు అభ్యసించే విద్యార్థులు 7 వేల పై చిలుకు మంది ఉన్నారు. కాగా ప్రాక్టికల్స్ నిర్వహణ కోసం జిల్లాలోని అన్ని కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కమాండ్ కంట్రోలు అనుసంధానం.....
జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసే సీసీ కెమె రాలను హైదరాబాద్‌లో గల ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేయనున్నారు. అక్కడ ఒక బృందం ఈ కెమెరాల ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును పర్యవేక్షించనుంది. ప్రాక్టికల్స్ ని ర్వహించే గదుల్లో రెండేసి చొప్పున వీడియోతో పాటు వాయిస్ రికార్డింగ్‌తో కూడిన సీసీ కెమెరాల ఏర్పా టుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రతి కళాశాలకు రూ. 25 వేలు.....
ప్రతీయేటా ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో విద్యార్థు లకు ప్రయోగ పాఠాలు బోధించేందుకు ఆధ్యాపకులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఈ సారి ప్రతీ కళాశాలకు 25 వేల రూపాయలను గత నెలలో కేటాయించింది. ఆ మేరకు భౌతిక, రసా య న శాస్త్రాలు, జంతు, వృక్ష శాస్త్రాల ప్రయోగాల కో సం కావాల్సిన పరికరాలు, రసాయనాలను కళాశాల ల్లో సమకూర్చారు. దీంతో నెల రోజుల నుంచి అధ్యా పకులు విద్యార్థులకు ప్రయోగ పాఠాలు బోధిస్తు న్నారు. జిల్లాలో సుమారు 7వేల పైచిలుకు మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రశ్నా పత్రం ఏ రోజుకారోజు ప్రిన్సిపాల్ లాగిన్‌కు మెయిల్ ద్వారా రానుండగా, దాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రింట్ తీసుకొని విద్యార్థులకు అంది స్తారు. అక్రమాల నిరోధానికి మునుపెన్నడూలేని వి ధంగా ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో పలు కళాశాలల యాజమాన్యాలు ఆగమే ఘాల మీద సీసీ కెమెరాల బిగింపు, ప్రాక్టికల్స్‌కు సంబంధించిన పరికరాలు, రసాయనాలు తెప్పించారు.
ప్రైవేట్ కళాశాలలకు మినహాయింపు...!
ప్రాక్టికల్ పరీక్షల్లో సీసీ కెమెరాల ఏర్పాటును పైవ్రే ట్ కళాశాల యాజమాన్యాలు మొదటి నుంచీ వ్యతిరే కిస్తున్నాయి. కేవలం 60 మార్కుల పరీక్ష కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సమంజసం కాదని చె బుతున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలం గా ణలోనే కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సిద్ధం కావడంతో యాజమా న్యాలు ఒకింత నిరసన వ్యక్తం చేశాయి. సీసీ కెమెరాలు ఏర్పా టు చేయవద్దని, సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిం చాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి తీరు సరిగా లేదని, ఆయనను బోర్డు నుంచి తప్పిచాలని, లేకుంటే బోర్డు పరీక్షల కోసం తమ కళాశాలల్లో పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు సహకరించబోమని సూచించారు. దీంతో పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రైవేటు కళాశాలలకు మినహా యింపునిచ్చింది.
ఇంటర్ బోర్డే పర్యవేక్షిస్తుంది..
అంజయ్య, డీఐఈవో మంచిర్యాల
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై ఈసారి బోర్డు అధికారులు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కళాశాల్లోని ల్యా బ్స్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయింది. ప్రతీ సీసీ కెమె రాపై బోర్డు ఉన్నతా ధికారుల నిఘా ఉంటుంది. ఉన్నతాధి కా రుల ఆదేశాలను ప్రతీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాటించాలి.