Infant Dies : డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యంతో పసికందు మృతి
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:32 AM
డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యంతో రెండు రోజుల పసికందు మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం జరిగింది.

వికారాబాద్ ఆసుపత్రి ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన
వికారాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యంతో రెండు రోజుల పసికందు మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం జరిగింది. నవాబుపేట మండలం మాదిరెడ్డిపల్లికి చెందిన భిక్షపతి, స్వప్న దంపతులకు జనవరి 4న వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డ జన్మించాడు. సోమవారం తెల్లవారుజామున బాబుకి ఎక్కిళ్లు ప్రారంభం కాగా డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో... ఎక్కిళ్లు ఎక్కువై స్పృహ కోల్పోయాడు. పిల్లల డాక్టర్ వచ్చి చూసి చనిపోయినట్లు నిర్ధారించారు. డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యంతోనే తమ బాబు మరణించాడని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బాబు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.