Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్ల వివరాలు ఇక ఆన్‌లైన్‌లో లబ్ధిదారులకు సులభమైన సేవలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:27 AM
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకతను పెంచుతూ, లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకతను పెంచుతూ, లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీుఽఛీజీట్చఝఝ్చజీుఽఛీజూఠ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ను నవీకరించి, ఇళ్ల పురోగతి, బిల్లుల చెల్లింపుల స్థితి వంటి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కల్పించామని గౌతమ్ పేర్కొన్నారు. లబ్ధిదారులు కార్యాలయాలకు వెళ్లకుండానే తమ ఫోన్ నంబరు, రేషన్ కార్డు నంబరు, అప్లికేషన్ నంబరు ఉపయోగించి ఎక్కడి నుంచైనా సమాచారాన్ని పొందవచ్చని ఆయన వివరించారు.