Share News

మార్ఫింగ్‌ ఫొటోలతో బెదిరించి.. టెన్త్‌ విద్యార్థినిపై తోటి విద్యార్థి లైంగిక దాడి

ABN , Publish Date - Mar 17 , 2025 | 03:49 AM

టోలను అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్‌ చేశాడు. అనంతరం వాటిని ఆ బాలికకు చూపించి తాను చెప్పినట్లు వినకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి ఆమెను లోబర్చుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు.

మార్ఫింగ్‌ ఫొటోలతో బెదిరించి.. టెన్త్‌ విద్యార్థినిపై తోటి విద్యార్థి లైంగిక దాడి

  • వారు సన్నిహితంగా ఉన్న వీడియో తీసి.. బాలికను వేధించిన మరో ఇద్దరు విద్యార్థులు

  • ముగ్గురు బాలుర అరెస్టు.. హోమ్‌కు తరలింపు

హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): తనతో పాటు చదువుతోన్న బాలిక ఫొటోలను సేకరించిన తోటి విద్యార్థి పథకం ప్రకారం ఆ ఫొటోలను అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్‌ చేశాడు. అనంతరం వాటిని ఆ బాలికకు చూపించి తాను చెప్పినట్లు వినకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి ఆమెను లోబర్చుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీసిన మరో ఇద్దరు విద్యార్థులు బాలికకు ఆ వీడియో చూపించి లైంగికంగా వేధించసాగారు. బాలిక తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతోన్న బాలుడు అదే తరగతిలోని ఓ బాలికతో స్నేహంగా ఉండేవాడు.


ఈ క్రమంలో బాలిక ఫొటోలను సేకరించిన అతడు వాటిని మార్ఫింగ్‌ చేసి అశ్లీల చిత్రాలుగా మార్చాడు. వాటిని బాలికకు చూపించి తాను చెప్పినట్లు వినాలని లేదంటే ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తానని బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారు ఏకాంతంగా ఉన్న సమ యంలో మరో విద్యార్థి వీడియో తీసి దాన్ని తన స్నేహితుడికి పంపా డు. అనంతరం ఆ వీడియోను బాలికకు చూపించి వారిరువురూ బాలికను వేధించసాగారు. బాలిక మనోవేదనను గమనించిన తోటి విద్యార్థినులు.. ఆమె తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని హోమ్‌కు తరలించారు.

Updated Date - Mar 17 , 2025 | 03:49 AM