National Engineers Day: 15న ఇంజనీర్లకు అభినందన సభ
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:21 AM
ఈనెల 15న జాతీయ ఇంజనీర్ల దినోత్సవం (మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి) సందర్భంగా హైదరాబాద్‌లోని జలసౌధలో ఇటీవలే పదోన్నతులు పొందిన ఇంజనీర్లకు అభినందన సభ నిర్వహించనున్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఈనెల 15న జాతీయ ఇంజనీర్ల దినోత్సవం (మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి) సందర్భంగా హైదరాబాద్‌లోని జలసౌధలో ఇటీవలే పదోన్నతులు పొందిన ఇంజనీర్లకు అభినందన సభ నిర్వహించనున్నారు. మూడు దశాబ్దాల విరామం తర్వాత అన్ని స్థాయిల్లోని అధికారులకు పదోన్నతి కల్పించారు. ఈనెల 1 వరకు అన్ని దశల్లో పదోన్నతి పొందినవారికి పోస్టింగులు ఇచ్చారు. దీంతో 360మందికిపైగా అధికారులకు ప్రయోజనం కలిగింది.
శాఖలో సర్వీసు వివాదం జోన్ 5, జోన్ 6 మధ్య ఉండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల సర్వీసు వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. న్యాయస్థానం నుంచి అనుకూల తీర్పు వెలువడటంతో వెంటనేశాఖ పదోన్నతుల కమిటీ వేసి పదోన్నతుల ప్రక్రియను చేపట్టారు. ఈ నేపథ్యంలో పదోన్నతులు పొందిన ఇంజనీర్లను అభినందించేందుకు నిర్వహించే కార్యక్రమంలో సీఎం, మంత్రి పాల్గొని వారికి దిశానిర్దేశం చేయనున్నారు.