BSP: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇబ్రాం శేఖర్
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:39 AM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని బాలాపూర్‌కు చెందిన ఇబ్రాం శేఖర్‌ను బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్ష పదవి వరించింది.
సరూర్‌నగర్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని బాలాపూర్‌కు చెందిన ఇబ్రాం శేఖర్‌ను బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్ష పదవి వరించింది. దాదాపు 15 సంవత్సరాలుగా ఆయన బీఎస్పీలో అంకితభావంతో పనిచేస్తూ, పార్టీ సిద్ధాంతాలను బహుజనుల్లోకి తీసుకెళ్తూ గుర్తింపు పొందారు.
అంతకుముందు మంద కృష్ణమాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలోనూ కీలకంగా పాల్గొన్నారు. బీఎస్పీ ప్రస్తుత అధ్యక్షుడు ప్రభాకర్ ఇటీవల రాజీనామా చేయడంతో ఇబ్రాం శేఖర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తూ బుధవారం బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. ఓటును పోరాట సాధనంగా మలిచి బహుజనులకు రాజ్యాధికారం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు.