Share News

అప్పరు ప్లాట్‌కు సాగునీరు తీసుకొస్తా

ABN , Publish Date - Feb 12 , 2025 | 11:11 PM

నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పర్‌ ప్లాట్‌ ప్రాంతంలో రైతులు ఎదురుచూస్తున్న వ్య వసాయానికి సాగునీరు అందించే కృషి చేస్తా నని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

అప్పరు ప్లాట్‌కు సాగునీరు తీసుకొస్తా
ఎల్మపల్లి గ్రామంలో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అమ్రాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పర్‌ ప్లాట్‌ ప్రాంతంలో రైతులు ఎదురుచూస్తున్న వ్య వసాయానికి సాగునీరు అందించే కృషి చేస్తా నని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. మండల కేంద్రమైన అమ్రాబాద్‌లో రోడ్డు విస్తర ణ పనులతో పాటు మాధవన్‌పల్లి, కల్ములోని పల్లి, ఎల్మపల్లి, చింతలోనిపల్లి తదితర గ్రామాల లో సుమారు రూ. 5 కోట్లతో నిర్మించనున్న సీసీరోడ్ల పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకు స్థాపన చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డితో మాట్లాడి కృష్ణానదిపై మద్దిమడుగు వద్ద బ్రిడ్జి నిర్మాణం తో పాటు నల్లమలలో పర్యాటక అభివృద్ధికి కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అ మ్రాబాద్‌ సింగిల్‌విండో చైర్మన్‌ గణేష్‌, అచ్చం పేట వ్యవసాయ మార్కెట్‌ కమి టీ వైస్‌చైర్మన్‌ ఆర్‌ వెంకటయ్య, కాంగ్రెస్‌ మం డల అధ్యక్షుడు హరినారాయణగౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు నాసరయ్య, మల్లికార్జున్‌, రాజగో పాల్‌, లింగం, ముక్రంఖాన్‌, బాల్‌లింగంగౌడ్‌ తిరుపయ్య, కృష్ణయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 11:11 PM