గద్దె దిగాలి
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:24 PM
అసెంబ్లీ ఎన్నికల ముం దు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మాయ మాటలతో మభ్యపెట్టి పం భం గడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగి ప్రజలకు క్షమాపణ చెప్పాలని జిల్లా మార్కెట్ క మిటీ మాజీ చైర్మన్ గంగనమోని కిరణ్ డిమాం డ్ చేశారు.

- నాగర్‌కర్నూల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగనమోని కిరణ్
బిజినేపల్లి/ తిమ్మాజిపేట/ పెంట్లవెల్లి, జనవ రి 30 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ ఎన్నికల ముం దు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మాయ మాటలతో మభ్యపెట్టి పం భం గడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగి ప్రజలకు క్షమాపణ చెప్పాలని జిల్లా మార్కెట్ క మిటీ మాజీ చైర్మన్ గంగనమోని కిరణ్ డిమాం డ్ చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరిం చుకొని మండల కేంద్రంలోని గాంధీజీ విగ్రహా నికి బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అంద జేసి మాట్లాడారు. ఎన్నికల ముందు అధి కార దాహంతో ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చి, గద్దెనెక్కాక ఆ హామీలను గాలికి వదిలేశారని ఎద్దే వా చేశారు. రాబోయే స్థాని క ఎన్నికల్లో ఓటు ద్వారానే కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, మాజీ రైతుబంధు మండల అధ్యక్షుడు నెల్లికంటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు బత్తిని తిరుపతి రెడ్డి, రాధాతిరుప తిరెడ్డి, సురభి శేఖర్‌రావు, మాజీ సర్పంచులు వంశీ నాయక్, అల్లోజీ, లింబ్యా నాయక్, మాజీ కోఆప్షన్ జహం గీర్ ఉన్నారు.
గాంధీ విగ్రహానికి వినతి
తిమ్మాజిపేట : అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరుతూ గురువారం తిమ్మాజిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గాంధీజీ విగ్రహానికి బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు. కార్య క్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వేణుగోపాల్‌గౌడ్, బీఆర్‌ఎస్ పార్టీ నా యకులు స్వామి, వెంకటేశ్, మోహనా చారి, ప్రశాంత్ కుమార్, రమాకాంత్, మల్లేష్ పాల్గొన్నారు.
పెంట్లవెల్లిలో..
పెంట్లవెల్లిలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గాంధీ విగ్ర హానికి బీఆర్‌ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయ కులు రాజేష్, సురేందర్‌గౌడ్, రఫీయోద్దిన్, రవిగౌడ్, బంకలి నరసింహ పాల్గొన్నారు.