Share News

హైడ్రా కూల్చివేతలు ప్రజల సౌకర్యం కోసమే..

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:55 AM

హైడ్రా కూల్చివే తలు ప్రజల సౌకర్యం కోసమేనని, నాళాలను ఆక్రమించడం వల్ల వరద నీరు ఇళ్లకు చేరి ప్రజలకు ఇబ్బందిగా మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.

హైడ్రా కూల్చివేతలు ప్రజల సౌకర్యం కోసమే..
వార్డులో పర్యటిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

జగిత్యాల అర్బన్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): హైడ్రా కూల్చివే తలు ప్రజల సౌకర్యం కోసమేనని, నాళాలను ఆక్రమించడం వల్ల వరద నీరు ఇళ్లకు చేరి ప్రజలకు ఇబ్బందిగా మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. పట్టణంలోని 4వ వార్డులో రూ.20 లక్షలు, 3వ వార్డులో రూ.20 లక్షల నిధులతో చేప ట్టిన అభివృద్ధి పనులకు మున్సిపల్‌ చైర్మన్‌ అడువాల జ్యోతితో కలి సి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర జల మద్ధతుతోనే నా గెలుపు సాధ్యమైందని, రాజకీయాలు ఎన్నిక ల వరకేనని, అభివృద్ధి మాత్రం నిరంతర ప్రక్రియ అన్నారు. రూ.36 కోట్ల నిధులతో పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరా ఏర్పా టు చేస్తున్నామని, దానికి సంబంధించిన పనులు జరుగుతున్నా యన్నారు. జగిత్యాల యావర్‌ రోడ్డు నుంచి తిప్పన్నపేట, అనంతా రం వరకు బ్లాక్‌ స్పాట్‌ రోడ్డు ఏర్పాటుకు పూర్తి చేస్తాన న్నారు. పట్టణంలో కేంద్రీయ విద్యాలయం, ఏకలవ్య పాఠశాల, కస్తూర్బా పాఠశాల మంజూరు కానున్నాయని, అందుకు ఎంపీ అర్వింద్‌ సా నుకూలంగా స్పందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, మాజీ చైర్మన్‌ గిరి నాగభూషణం, కమిషనర్‌ చిరంజీవి, కౌన్సిలర్లు క్యాదాసు నవీన్‌, చదువుల తిరుపతమ్మ, నారాయణ రెడ్డి, పంబాల రామ్‌ కుమార్‌, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు మండలంలోని వెల్ధుర్తి గ్రామంలోని జంబుల వాగు, కొత్త గుంట వాగుపై ఉన్న కల్వర్టు స్థానంలో బ్రిడ్జి నిర్మిం చాలని వెల్ధుర్తి గ్రామ రైతులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.

Updated Date - Jan 07 , 2025 | 12:56 AM