Share News

Deepanshi Agarwal: సీఏ ఇంటర్‌ ఫలితాల్లో టాపర్‌గా హైదరాబాద్‌ అమ్మాయి

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:53 AM

ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) మంగళవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో దీపాన్షీ 86.63 శాతం స్కోర్‌తో 600 మార్కులకు 521 మార్కులు సాధించి

 Deepanshi Agarwal: సీఏ ఇంటర్‌ ఫలితాల్లో టాపర్‌గా హైదరాబాద్‌ అమ్మాయి

521 మార్కులతో సత్తా చాటిన దీపాన్షీ అగర్వాల్‌

86% స్కోర్‌తో రెండో స్థానంలో విజయవాడ అబ్బాయి

హైదరాబాద్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సీఏ ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన దీపాన్షీ అగర్వాల్‌ జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) మంగళవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో దీపాన్షీ 86.63 శాతం స్కోర్‌తో 600 మార్కులకు 521 మార్కులు సాధించి జాతీయస్థాయిలో తొలిస్థానం సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా దీపాన్షీ మాట్లాడుతూ.. రోజుకు 8-10 గంటల వరకు చదివానని, తన తండ్రి ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ఈ ఫలితాల్లో విజయవాడకు చెందిన తోట సోమనాథ్‌ శేషాద్రి నాయుడు 86 శాతం స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచారు.

Updated Date - Mar 05 , 2025 | 03:53 AM