Hyderabad Rain: భాగ్యనగరంలో భారీ వాన
ABN , Publish Date - May 05 , 2025 | 09:26 PM
రాజధాని హైదరాబాద్ నగరంలో భారీగా వర్షం కురుస్తోంది. రాత్రి 8.30 నుంచి నెమ్మదిగా ప్రారంభమైన వాన జోరందుకుంది. ఫలితంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీగా వాన కురుస్తోంది.
Hyderabad Rain: రాజధాని నగరం హైదరాబాద్లో సోమవారం రాత్రి సమయానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 8.30 నుంచి నెమ్మదిగా ప్రారంభమైన వాన జోరందుకుంది. ఫలితంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీగా వాన కురుస్తోంది. మిన్ను విరిగి మీద పడ్డట్టుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, మణికొండ, మెహదీపట్నం, హైటెక్ సిటీ, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, కృష్ణానగర్ ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు కురిశాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భారీగానే వర్షం కురుస్తోంది.