Share News

MLA KTR: కాంగ్రెస్ పాపం.. ప్రజలకు శాపం: కేటీఆర్

ABN , Publish Date - Jul 16 , 2025 | 09:32 AM

KTR: తెలంగాణపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో వ్యవసానికి నీళ్ల కరువు.. పట్టణంలో వ్యక్తిగత అవసరాలకు నీళ్ల కరువు అని సెటైర్లు వేశారు. సర్కారు నిర్వహణ లోపంతో ఏకంగా రోజుకు ఏకంగా 8వేల ట్యాంకర్ల డిమాండ్ ఉందని చెప్పారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారిందన్నారు.

MLA  KTR: కాంగ్రెస్ పాపం.. ప్రజలకు శాపం: కేటీఆర్
MLA KTR

హైదరాబాద్, జులై 16: కాంగ్రెస్ (Congress) ప్రబుత్వంపై మరోసారి విమర్శల దాడికి దిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (MLA KTR). సోషల్ మీడియా ఎక్స్ (X) వేదికగా.. కాంగ్రెస్ పాలనపై చురకలు అంటించారు. కృష్ణా, గోదావరి నదుల నిండా నీళ్లు పారుతున్న, వాటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాక అన్ని వ్యవస్థలు పతనమవుతున్నాయని ఆరోపించారు. నీళ్లు కొనలేక, పాట్లు పడలేక ప్రజల అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ పాపం.. ప్రజలకు శాపం..!

కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో.. 'పల్లెల్లో సాగునీళ్లు లేవు..పట్నంలో తాగునీళ్లు లేవు. నాడు ఇంటింటికీ నల్లా నీళ్లు.. నేడు సాగు, తాగునీళ్లు లేక జనం కన్నీళ్లు. కృష్ణా, గోదావరి నదుల నిండా నీళ్లు పారుతున్న, వాటిని ఎత్తిపోయకుండా కక్షగట్టిన కాంగ్రెస్ సర్కార్. కాళేశ్వరం గేట్లు తెరిచిపెట్టారు, పాలమూరు రంగారెడ్డి పనులు పడావుపెట్టారు. సర్కారు మోసానికి సాక్ష్యంగా వెలవెలబోతున్న రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు. అడుగంటుతున్న బోర్లు, పడావుపడ్డ పొలాలు. వ్యవసాయానికే కాదు .. వ్యక్తిగత అవసరాలకు లేని నీళ్లు.

సాగునీళ్లను వదిలిపెట్టి తాగునీళ్లకూ బలిపెడుతున్న ప్రభుత్వం. రెండు రోజులు ఎదురుచూసినా రాని ట్యాంకర్లు. ఎన్ని సార్లు ఫోన్లు చేసినా స్పందించని అధికారులు. సర్కారు నిర్వహణ లోపంతో ఏకంగా రోజుకు ఏకంగా ఎనిమిది వేల ట్యాంకర్ల డిమాండ్. పాలన చేతగాక పతనమవుతున్న వ్యవస్థలు. నీళ్లు కొనలేక, పాట్లు పడలేక ప్రజల అవస్థలు. కాంగ్రెస్ పాపం, ప్రజలకు శాపం. జాగో తెలంగాణ జాగో' అని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సెటైరికల్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం

మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..

Updated Date - Jul 16 , 2025 | 09:39 AM