KTR: ఎమ్మెల్సీల రద్దుపై కేటీఆర్ రియాక్షన్.. సుప్రీంకు ధన్యవాదాలు
ABN , Publish Date - Aug 13 , 2025 | 07:29 PM
గతంలో బీజేపీ.. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు అడ్డుపడ్డారని గుర్తు చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆరోపించారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీలు కోదండరాం, అలీఖాన్‌ల నియామకం రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని విమర్శించారు.
గతంలో బీజేపీ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు అడ్డుపడ్డారని గుర్తు చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే మరో ఇద్దరి పేర్లను సిఫార్సు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ గతంలో నామినేట్ చేసిన బడుగు, బలహీనవర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణల అభ్యర్థిత్వాలకు అడ్డుతగిలిన కాంగ్రెస్, బీజేపీల నిజస్వరూపం మరోసారి బట్టబయలైందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని ఈ రెండు ఢిల్లీ పార్టీల అప్రజాస్వామిక విధానాలు ఎంతమాత్రం సాగనివ్వమని చాటిచెప్పిన న్యాయవ్యవస్థకు బీఆర్ఎస్ పక్షాన శిరస్సు వంచి సలాం చేస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
అభిమానిని తోసేసిన జయా బచ్చన్.. దెబ్బకు జడుసుకున్నాడు..
30 ఏళ్ల స్నేహం.. ఫ్రెండ్ భార్యతో ఎఫైర్ పెట్టుకుని