Share News

Hyderabad: హ్యాష్ ఆయిల్‌ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు

ABN , Publish Date - Nov 07 , 2025 | 02:21 PM

హైదరాబాద్‌లో భారీగా హ్యాష్ ఆయిల్ పట్టుబడింది. మియాపూర్ అల్విన్ కాలనీ వద్ద హ్యాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుపడ్డ వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన 1.6 కేజీల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: హ్యాష్ ఆయిల్‌ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు
Huge hash oil seizure

హైదరాబాద్‌, నవంబర్ 7: మియాపూర్ అల్విన్ కాలనీ వద్ద హ్యాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒడిశాకు చెందిన సోనియా అనే వ్యక్తి దీన్ని హైదరాబాద్‌కు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. విశ్వనీయ సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ టీమ్, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసులో ప్రధాన సూత్రధారి సోనియానే అని తేల్చారు పోలీసులు.


సోనియాకు సహాయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు లక్ష్మి, దుర్గప్రసాద్, దుర్గను సైతం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుపడ్డ వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన 1.6 కేజీల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మాదాపూర్ ఎస్ఓటీ టీమ్ మియాపూర్ పోలీసులకు కేసు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.


ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గత మూడ్రోజుల క్రితం తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే డ్రగ్స్ పెట్టుకొని సరఫరా చేస్తున్న జాన్‌పాల్‌ అనే డాక్టర్​ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దిల్లీ, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని డ్రగ్స్ ఎక్స్ పోర్ట్ చేయడం ప్రారంభించాడు. ఇలా వచ్చిన డబ్బును స్నేహితులకు ఇస్తూ, తాను డ్రగ్స్​ను ఉచితంగా వినియోగిస్తున్నాడు.


దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి ఈ వ్యవహారం గుట్టురట్టు చేశారు. అతడి నివాసంలో తనిఖీలు చేపట్టి రూ.3 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు పట్టుకున్నారు. జాన్‌పాల్‌ను అరెస్టు చేసి, మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి:

Harish Vs CM Revanth: బ్లాక్ మెయిలర్‌కు బుద్ధి చెప్పండి.. సీఎంపై హరీష్ సంచలన వ్యాఖ్యలు

Jubilee Hills By-Election: రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లకు భారీగా జన సమీకరణ

Updated Date - Nov 07 , 2025 | 03:26 PM