Rehmatnagar Acid Death: దారుణం.. కూల్ డ్రింక్ అనుకుని యాసిడ్ తాగిన వ్యాపారి మృతి
ABN , Publish Date - Sep 21 , 2025 | 09:42 PM
కూల్ డ్రింక్ అనుకుని పొరపాటు యాసిడ్ తాగిన ఓ చిరు వ్యాపారి దుర్మరణం చెందిన ఘటన రహ్మత్ నగర్‌లో తాజాగా వెలుగు చూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కూల్ డ్రింక్ అనుకుని పొరపాటున యాసిడ్ తాగి ఓ చిరు వ్యాపారి మృతి చెందిన ఘటన నగరంలోని రహ్మత్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశాకు చెందిన సుశాంత్ సాహూ (43) తన భార్య సుమిత్రతో కలిసి స్థానికంగా ఉంటున్నాడు. రహ్మత్ నగర్ చౌరస్తాలో ఓ చిన్న టీస్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య టీచర్ (Hyderabad acid mistaken cool drink).
ఇటీవల సుమిత్ర బాత్రూమ్ శుభ్రం చేసేందుకు మార్కెట్ నుంచి యాసిడ్‌ను కొనుగోలు చేసింది. ఇంట్లో ఖాళీగా ఉన్న కూల్ డ్రింక్ బాటిల్స్‌లో యాసిడ్‌ను నింపి కిచెన్‌లో పెట్టింది. కాగా, ఈ నెల 19న సాహూ తన కుమార్తెను స్కూల్ నుంచి తీసుకొచ్చాడు. భోజనం అనంతరం, అతడు వంటగదిలోకి వెళ్లి కూల్ డ్రింక్ బాటిల్‌లోని యాసిడ్‌ను పొరపాటున తాగి కింద పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు (Rehmatnagar acid death).
ఈ వార్తలు కూడా చదవండి
మాజీ డీఎస్పీ నళిని సంచలన పోస్టు.. అసలు విషయమిదే..
హైడ్రా కూల్చివేతల్లో ఉద్రిక్తత.. ఎందుకంటే..
Read Latest Telangana News And Telugu News