Hyderabad: రూ.2 కోట్ల విలువైన రద్దయిన నోట్ల పట్టివేత
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:01 AM
కేంద్ర ప్రభుత్వం 2016లో రద్దు చేసిన రూ.500, రూ.1,000 నోట్లను పెద్దమొత్తంలో మార్పిడి చేస్తున్న ముఠాను హైదరాబాద్ తూర్పుమండలం పోలీసులు అరెస్టు చేశారు.
హిమాయత్‌నగర్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం 2016లో రద్దు చేసిన రూ.500, రూ.1,000 నోట్లను పెద్దమొత్తంలో మార్పిడి చేస్తున్న ముఠాను హైదరాబాద్ తూర్పుమండలం పోలీసులు అరెస్టు చేశారు. నారాయణగూడలోని కెనరా బ్యాంకు వద్ద ఇద్దరిని, స్థానిక జలమండలి కార్యాలయం వద్ద మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.2 కోట్లు విలువ చేసే రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. నిందితులను టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత.. తదుపరి దర్యాప్తు నిమిత్తం నారాయణగూడ పోలీసులకు అప్పగిస్తారు.