Share News

Hyderabad Book Fair 2025: రెండో రోజు బుక్ ఫెయిర్‌కు అద్భుత స్పందన

ABN , Publish Date - Dec 21 , 2025 | 10:41 AM

పాఠశాల విద్యార్థులు విహారయాత్రలా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనకు వస్తున్నారు. వివిధ రకాల పుస్తకాలు కొంటున్నారు. 'పుస్తకం చదవకుండా రోజు గడవదని' కొంతమంది చిన్నారుల సమాధానమే పుస్తకానికి ఆదరణ తగ్గలేదనడానికి నిదర్శనం. రెండో పుస్తక ప్రదర్శనకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Hyderabad Book Fair 2025: రెండో రోజు బుక్ ఫెయిర్‌కు అద్భుత స్పందన
Hyderabad Book Fair 2025

హైదరాబాద్ సిటీ, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : 'డిజిటల్ యుగంలో పుస్తకాలు చదివేదెవరు?' ప్రశ్నకు దీటైన సమాథానం పుస్తకాల వండుగ పిల్లలు పుస్తక పఠనానికి దూరమయ్యారన్న బెంగను చెరిపేస్తూ.. చిన్నారులు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు విహారయాత్రలా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనకు వస్తున్నారు. వివిధ రకాల పుస్తకాలు కొంటున్నారు. 'పుస్తకం చదవకుండా రోజు గడవదని' కొంతమంది చిన్నారుల సమాధానమే పుస్తకానికి ఆదరణ తగ్గలేదనడానికి నిదర్శనం. రెండో పుస్తక ప్రదర్శనకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.


అలరించే అమరచిత్ర కథ

చిన్నారుల అభిమానాన్ని చూరగొన్న టింకిల్, సుప్పండి వంటి కామిక్ స్టోరీస్... మహాభారతం, రామాయణ బొమ్మల కథలు, మనసును హత్తుకొనే ఎపిక్ స్టోరీస్, మహనీయుల స్ఫూర్తిగాథలు, జానపద కథలు.. ఒకటా, రెండా బాలలను అందమైన పుస్తకాల ప్రపంచంలోకి తీసుకెళ్లే కల్పిత రచనలు, హాస్యకథలు మరెన్నో అమరచిత్ర కథ - స్టాల్ నెంబరు101లో లభ్యమవుతున్నాయి. వక్రతుండ బుక్ ల్ 63లోనూ పిల్ల లకు ఇష్టమైన షెర్లాక్ హోమ్స్, హెచ్ వెల్స్ కలె క్షన్, చార్లీ అండ్ ది క్రిస్మస్ ప్యాక్టరీ తదితర నవ లలు, ఎన్సైక్లోపీడియా పుస్తకాలు అందుబా టులో ఉన్నాయి. పెగాసెస్ ప్రచురణ స్టాల్ 75లో ప్రీప్రైమరీ, ప్రైమరీ పిల్లల కోసం పుస్తకాలు, అట్లాస్, భూమి, సముద్రాలు, జంతువులు, అడవులు వంటి ప్రకృతిలోని పలు అంశాలపై విడివిడిగా 500 ప్యాక్ట్స్ ఆఫ్ హిస్టరీ సిరీస్లు, ఆర్ట్ అండ్ క్రాప్ట్ లెర్నింగ్ వంటి ఆంగ్ల పుస్తకాలు కొలువుదీరాయి.


బాలసాహిత్యం లోనూ వయసులవారీగా పుస్తకాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి కిడ్స్ స్పేస్ ఇంటర్నేషనల్ స్టాల్-128లో, కోతులు కళ్లద్దాలు', 'కాలం పంపిన అతిథులు' వంటి అరుదైన బొమ్మల పుస్తకాలు లిఖితప్రెస్ స్టాల్ నెంబరు 62లో చూడొచ్చు. తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ, హిందీ భాషల్లోని అపు రూపమైన బాల సాహిత్యంకోసం నేషనల్ బుక్ ట్రస్ట్ స్టాల్ నెంబరు 29 సందర్శించాల్సిందే. చందమామ కథలు పుస్తకాలు నవోదయ బుక్ హౌస్-43లో లభ్యమవుతున్నాయి. పిల్లల కోసమే కొన్నేళ్లుగా పుస్తకాలు ప్రచురిస్తున్న 'మంచిపుస్తకం' స్లాల్ 219లోకి ఆడుగుపెట్టగానే బోలెడన్ని బొమ్మల కథలు పలకరిస్తాయి.



ఈ వార్తలు కూడా చదవండి:

HMWS&SB: సమ్మర్‌కు హైదరాబాద్ సిద్ధం: ట్యాంకర్ నెట్‌వర్క్ విస్తరణ

Hyderabad Visit: లోక్‌భవన్‌కు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌

Updated Date - Dec 21 , 2025 | 10:41 AM