Hyderabad Near Tourists Places: హైదరాబాద్‌కు దగ్గర్లోనే అందమైన ప్రదేశాలు.. మీరు చూశారా...
ABN , Publish Date - May 18 , 2025 | 12:00 PM
కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం అంటూ బాగా అలసిపోతున్నారా? అయితే, మీరు తప్పకుండా రిలాక్స్ అవ్వాలి. కానీ, రిలాక్స్ కావాలంటే టూర్కు వెళ్తేనే సాధ్యం అవుతుంది. మరి.. హైదరాబాద్ దగ్గర్లోని ఈ అందమైన పర్యాటక ప్రదేశాలను అలా చూట్టేసి రండి..
కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం అంటూ బాగా అలసిపోతున్నారా? అయితే, మీరు తప్పకుండా రిలాక్స్ అవ్వాలి. కానీ, రిలాక్స్ కావాలంటే టూర్కు వెళ్తేనే సాధ్యం అవుతుంది. మరి.. హైదరాబాద్ దగ్గర్లోని ఈ అందమైన పర్యాటక ప్రదేశాలను వీకెండ్లో అలా చూట్టేసి రండి..
పోచారం అభయారణ్యం
హైదరాబాద్ నుంచి 113 కి.మీ దూరంలో మెదక్ జిల్లాలో పోచారం అభయారణ్యం ఉంది. ఈ అటవీ ప్రాంతంలో అరుదైన పక్షులతో పాటు ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. ప్రకృతిని బాగా ఇష్టపడేవారికి, జంతులను ప్రేమించేవారికి ఈ ప్రదేశాం బాగా నచ్చుతుంది.
నాగార్జున సాగర్
హైదరాబాద్ సమీపంలోని నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ అద్భుతమైన ప్రదేశం. హైదరాబాద్ నుంచి 155 కి.మీ దూరం ఉన్న ఈ ప్రాంతానికి వెళ్తే మీరు కృష్ణా నదిపై నిర్మించిన నాగార్జున సాగర్ ఆనకట్టను చూడవచ్చు. అంతేకాకుండా, బౌద్ధ విహారంతోపాటు.. ప్లానిటోరియం, ఆర్ట్ గ్యాలరీ కూడా చూడొచ్చు. అలాగే, ఆనాటి సంస్కృతిక వైభవం తోపాటు కళాఖండాల అద్భుతాలను చూడొచ్చు.
అనంతగిరి హిల్స్
అనంతగిరి హిల్స్ హైదరాబాద్ నుంచి 75 కి.మీ దూరంలో ఉంటుంది. హిల్ స్టేషన్లలో అనంతగిరి కొండలు చాలా అందంగా ఉంటాయి. వికారాబాద్ జిల్లాలోని ఈ అనంతగిరి హిల్స్ దాదాపు 3 వేలకుపైగా ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిని 'తెలంగాణ ఊటీ' అని పిలుస్తారు. ఎత్తయిన కొండలు, స్వచ్ఛమైన గాలి, మంచినీటి సరస్సులు ప్రకృతి ప్రేమికులను అనందంతో కట్టిపడేస్తాయి.
నల్లమల కొండలు
హైదరాబాద్‌కు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండలు కూడా ఒక మంచి హిల్ స్టేషన్. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విస్తరించి ఉన్నాయి.