New Year Celebrations: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. ప్రజలకు గుడ్‌న్యూస్
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:15 PM
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తమ ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సర వేడుకల్ని దృష్టిలో పెట్టుకుని 31వ తేదీ రాత్రి మెట్రోరైలు వేళలను హెచ్ఎమ్ఆర్ఎల్ పొడిగించింది.
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) తమ ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సాధారణంగా మెట్రో రైళ్లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ, కొత్త సంవత్సర వేడుకల్ని దృష్టిలో పెట్టుకుని 31వ తేదీ రాత్రి మెట్రోరైలు వేళలను హెచ్ఎమ్ఆర్ఎల్ పొడిగించింది. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రారంభ స్టేషన్‌ల నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరనున్నాయి. మెట్రో రైలు ప్రయాణీకులు దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ జర్నీని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.