HYDRAA: కబ్జాల చెర వీడిన 1.27 ఎకరాల పార్క్.. హైడ్రా విముక్తి
ABN , Publish Date - Oct 28 , 2025 | 06:09 PM
అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. తమ దృష్టికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తోంది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆయన ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 28: అక్రమ కట్టడాలు కూల్చేవేతే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా.. ఆ దిశగా దూసుకుపోతోంది. మంగళవారం నగరంలో వేర్వేరు చోట్ల ఆక్రమణలు తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆయన ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం కర్మన్‌ఘాట్ విలేజ్‌లోని హస్తినాపురం నార్త్ ఎక్స్‌టెన్షన్ కాలనీలో 1.27 ఎకరాల పార్క్ కబ్జా చేశారంటూ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించింది. పార్కు స్థలాన్ని లేఔట్‌లో చూపించి తర్వాత ప్లాట్లుగా విక్రయిస్తున్నారని గ్రహించి ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా కాపాడినట్టు పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.
శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్ పరిధిలోని గంగారాం కాలనీలో సుభాష్‌నగర్ పేరిట 1974లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు చెందినవారు లే ఔట్ వేశారు. ఇందులో 700 గజాల స్థలాన్ని ప్రజావసరాలకు కేటాయించారు. పేదల అవసరాల కోసం కేటాయించబడిన ఈ లేఔట్‌లో బడాబాబు పాగా వేశారు. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని ప్లాట్లుగా మార్చాడు. ఇలా ఆక్రమణలకు గురైన స్థలాన్ని కాపాడాలని అక్కడి నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసింది.
ఇవి కూడా చదవండి:
Kavitha: నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలి: కవిత
Kukatpally Raithu Bazar: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..