Hyderabad: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 24 కుక్క పిల్లల దత్తత
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:50 AM
వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్‌ఎంసీ చేపట్టిన దత్తత కార్యక్రమానికి హైదరాబాద్ వాసుల నుంచి మంచి స్పందన వచ్చింది.
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్‌ఎంసీ చేపట్టిన దత్తత కార్యక్రమానికి హైదరాబాద్ వాసుల నుంచి మంచి స్పందన వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలు నేపథ్యంలో వీధి కుక్కలను పట్టుకునేందుకు ఓ పక్క ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన జీహెచ్‌ఎంసీ.. మరోపక్క ’బీ ఏ హీరో.. అడాప్ట్ డోంట్ షాప్’ నినాదంతో కుక్కపిల్లల దత్తతకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కులో ఆదివారం నిర్వహించిన మేళాలో 39 దేశవాళి కుక్క పిల్లలను దత్తతకు అందుబాటులో ఉంచింది.
ఇందులో 24 కుక్క పిల్లలను హైదరాబాద్‌కు చెందిన జంతు ప్రేమికులు దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ మాట్లాడుతూ.. కుక్క పిల్లల దత్తత కార్యక్రమం వీధి కుక్కల నియంత్రణకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.