Share News

నూరు శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలి

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:10 AM

రేపటి పౌరులను తీర్చిదిద్ది సమాజానికి దిక్సూచిగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వంద శాతం ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో చరిత్ర సృష్టించాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన వాచ కమిటీ జాతీయ చైర్మన డాక్టర్‌ బొమ్మర బోయిన కేశవులు ముదిరాజ్‌ అన్నారు.

 నూరు శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ బొమ్మరబోయిన కేశవులు

నూరు శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలి

ఎలక్షన వాచ కమిటీ జాతీయ చైర్మన కేశవులు

నల్లగొండటౌన, నల్లగొండ రూరల్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రేపటి పౌరులను తీర్చిదిద్ది సమాజానికి దిక్సూచిగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వంద శాతం ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో చరిత్ర సృష్టించాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన వాచ కమిటీ జాతీయ చైర్మన డాక్టర్‌ బొమ్మర బోయిన కేశవులు ముదిరాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన యూనివర్సిటీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువుకున్న వారు, మేధావులు ఎంత పని ఉన్నా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుని సాధారణ ఓటర్లకు మార్గదర్శకులుగా నిలవాలని ఆయన కోరారు. అభ్యర్థులు ఎవరూ నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలని సూచించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓటును వృథా చేయవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల చీఫ్‌ ఎలక్షన కమిషనర్‌ సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన వాచ కమిటీకి ఓటర్‌ చైతన్యంపై కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీచర్స్‌ నియోజకవర్గం ఎన్నికలపై ఓటర్లతో చర్చావేదిక నిర్వహిస్తామని, గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గం ఓటర్లకు సెమినార్‌ నిర్వహిస్తామని తెలిపారు. వీటిపై నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు, పారదర్శకంగా ఎన్నికలు జరిగే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఎంజీయూ విశ్వవిద్యాలయం ఓఎస్డీ ప్రాఫెసర్‌ అంజిరెడ్డి, ప్రభుత్వ బాలికల జూనియ ర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ తోకల సుధారాణి, బీఆర్‌ఏఓయూ రీజనల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అంతటి శ్రీనివాస్‌, మాదగోని భిక్షపతిగౌడ్‌, సమాచార పరిరక్షణ సమితి, ఎలక్షన వాచ కమిటీ సభ్యులు తా ళ్ల నిరంజన, రేఖ్యానాయక్‌, కట్ట శ్రీనివాస్‌, మెట్టు మధు, శ్రీకాంత, మహేష్‌, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 01:10 AM