Share News

Street Dog Attacks: శునకాల దాడులపై హెచ్‌ఆర్సీ సుమోటోగా కేసు స్వీకరణ

ABN , Publish Date - Aug 19 , 2025 | 03:32 AM

రాష్ట్రంలో వీధి శునకాలు ప్రజలపై దాడి చేసి గాయపరచడంపై మానవ హక్కుల కమిషన్‌ ...

Street Dog Attacks: శునకాల దాడులపై హెచ్‌ఆర్సీ సుమోటోగా కేసు స్వీకరణ

  • ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

హైదరాబాద్‌/ గన్‌పార్క్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వీధి శునకాలు ప్రజలపై దాడి చేసి గాయపరచడంపై మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ) స్పందించింది. ఈ ఘటనలకు సంబంధించిన కేసును సుమోటోగా స్వీకరించింది. ముఖ్యంగా నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పరిగితో పాటు కొడంగల్‌ తదితర ప్రాంతాల్లో ఒకేరోజు 23 మందిపై వీధి శునకాలు దాడి చేసి గాయపరచాయి. ఈ ఘటనపై సోమవారం మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ డా.షమీమ్‌ అక్తర్‌ విచారణకు ఆదేశించారు. ముఖ్యంగా నల్లగొండలో వీధి కుక్కలు ఓ బాలుడిని పేగులు బయటికి వచ్చేలా కరిచాయి. దీనికి సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తకు హెచ్‌ఆర్సీ స్పందిస్తూ.. ఈమేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీధి శునకాల ఘటనలపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని సమగ్ర వివరణ కోరింది. ఈ నెల 22న పూర్తి నివేదికను ఇవ్వాలని కోరింది.

Updated Date - Aug 19 , 2025 | 03:32 AM