High Court Issues Notices: కబడ్డీ అసోసియేషన్‌కు హైకోర్టు నోటీసులు
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:46 AM
నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు కబడ్డీ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉండడం...
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు కబడ్డీ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉండడం, పార్ట్‌టైం కోచ్‌లతో శిక్షణ ఇప్పిస్తున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. నిబంధనలు పాటించడం లేదని, క్రీడాభివృద్ధి కోడ్ - 2011ను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ రిటైర్డ్ కబడ్డీ కోచ్ పవన్‌కుమార్ యాదవ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదిస్తూ.. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేదని, పిటిషనర్ కబడ్డీ కోచ్ కాబట్టి ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదన్నారు.