Flood Flow: బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:22 AM
ఎగువన కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరుగుతోంది మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను మంగళవారం అధికారులు ఎత్తి నీటిని విడుదల చేశారు.
మేడిగడ్డకు 12,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
భద్రాచలం వద్ద పెరిగిన నీటిమట్టం
జూరాలలో 7.590 టీఎంసీల నీటి నిల్వ
శ్రీశైలానికి 84,801 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సాగర్‌కు 58,750 క్యూసెక్కుల వరద
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) : ఎగువన కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరుగుతోంది మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను మంగళవారం అధికారులు ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీరాంసాగర్ ప్రస్తుత మంగళవారం సాయంత్రానికి 1064.90 అడుగుల 15 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం మేడిగడ్డకు మంగళవారం 12,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, అంతే నీరు విడుదల చేస్తున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మంగళవారం మద్యాహ్నం 2 గంటలకు 13.4 అడుగులకు చేరుకుంది.
జూరాలకు తగ్గిన వరద
జూరాలకు మంగళవారం తగ్గుముఖం పట్టింది. జూరాలలో 7.590 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 87 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. 9 గేట్లను ఎత్తి 60,070 క్యూసెక్కులతోపాటు 92,285 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలేశారు. మరోవైపు, శ్రీశైలం ప్రాజెక్టుకు 84,801 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, 162.4372 టీఎంసీల నీరు ఉన్నది.
సాగర్ నీటిమట్టం 140.8451 టీఎంసీలు
నాగార్జున సాగర్ పూర్తి నీటిమట్టం 312.0450 టీఎంసీలకు, ప్రస్తుతం 140.8451 టీఎంసీలు. శ్రీశె ౖలం నుంచి సాగర్‌కు 58,750 క్యూసెక్కుల నీరు వి డుదల చేశారు. జంట నగరాల తాగునీటి అవసరాలకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.